మాకు చావే దిక్కు.. అనుమతించండి.. ప్రధానికి హైవే బాధితుల లేఖలు
ముంబై–అహ్మదాబాద్ నేషనల్ హైవే పై ట్రాఫిక్ తో సంవత్సరాలుగా తీవ్రంగా కష్టపడుతున్న వసాయి (తూర్పు) నివాసితులు తమ ఆందోళనను వినూత్నంగా తెలిపారు. ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తమకు బలవన్మరణానికి అనుమతివ్వండి’ అంటూ ప్రధాని మోదీకి లేఖలు రాసి తమ నిరసనను వెల్లడించారు.

విధాత : ముంబై–అహ్మదాబాద్ నేషనల్ హైవే పై ట్రాఫిక్ తో సంవత్సరాలుగా తీవ్రంగా కష్టపడుతున్న వసాయి (తూర్పు) నివాసితులు తమ ఆందోళనను వినూత్నంగా తెలిపారు. ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తమకు ‘బలవన్మరణానికి అనుమతివ్వండి’ అంటూ ప్రధాని మోదీకి లేఖలు రాసి తమ నిరసనను వెల్లడించారు. గురువారం ఉదయం పెద్ద బృందాలుగా ఏర్పడిన వసాయి (తూర్పు) రెసిడెన్స్ ప్రజలు ప్రధానికి తమ లేఖలు పంపేందుకు సాసూం ఘర్ పోస్టాఫీసులో సమావేశమయ్యారు. లేఖలు పంపించారు. ఈ ప్రచారం మొదటి రోజే 100కి పైగా లేఖలు పోస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలను రక్షించాలని కోరుకుంటే, ముందుగా హైవేపై సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని.. ట్రాఫిక్ నియంత్రణని బలోపేతం చేయాలి అని స్థానికులు వాదిస్తున్నారు.ముంబై–అహ్మదాబాద్ నేషనల్ హైవే.. ససూంఘర్, మల్‌జిపాడా, ససుపాడా, బోబట్టపాడా, పతర్థపాడా వంటి ప్రాంతాల నుండి వెళ్తుంది.
అయితే, హైవేపై వేలాదిగా వాహనాలు ప్రయాణించడంతో తీవ్ర ట్రాఫిక్ ఏర్పడుతూ కష్టమైన మార్గం మారింది. రహదారిపై గుంతలు, ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం, రోడ్డు నిర్వహణలో లోపాలు తమ రోజువారీ ప్రయాణాన్ని కష్టంగా మార్చుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య అవసరాలు, ఆహారం, వైద్య చికిత్స, విద్యాలయాలకు వెళ్లడానికి ఈ హైవేపై ఆధారపడతారు. అయితే, నిరంతర ట్రాఫిక్ జామ్ వల్ల వారి రోజువారీ జీవితం ఇబ్బందికరంగా మారిందంటున్నారు.అయితే, తాము చాలా సార్లు అధికారులకు హైవే పరిస్థితిపై విజ్ఞప్తులతో పాటు నిరసనలు కూడా తెలియజేసిన సమస్యలను పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము ఎందుకు బలవన్మరణాలకు పాల్పడాలని అనుకుంటున్నదీ ఈ లేఖలో రాశామని అని ఒక పౌరుడు చెప్పాడు.‘మా ఫిర్యాదులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రోడ్లు ఎవరూ పరిశీలించడం లేదు. మా నిరసనలను వినిపించుకోవడం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుత్వం మాపై శ్రద్ధ చూపించకపోతే మా బలవన్మరణాలకు అనుమతించండి. 2014 నుండి, మేము ఈ ట్రాఫిక్ జామంతో జీవిస్తున్నాం’ అని భూమిపుత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సుశాంత్ పటిల్ చెప్పారు.