Gold Silver Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో విలువైన లోహాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Feb 28, 2026, 4:16 pm IST
Read Time: 3 mins
Gold Silver Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 7.140పెరిగి రూ.1,68,710కి చేరింది.  22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.6,550పెరిగి రూ. 1,55,650వద్ధ కొనసాగుతుంది.

కిలో వెండి ధర  ఉదయం రూ. 5000 పెరిగి , మధ్యాహ్నం మరోసారి రూ20,000పెరిగి  రూ.3,20,000లక్షల మార్కుకు చేరింది. శుభకార్యాల సమయంలో బంగారం, వెండి ధరల భారీ పెరుగుదల కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది.

అంతర్జాతీయ పరిణామాలతో ధరల్లో మార్పులు

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలలోని మార్పులు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ఆర్థిక నిర్ణయాలు, ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు అప్రమత్తమై విలువైన లోహాల వైపు పెట్టుబడులు మళ్లించారు. దీంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. మునుముందు కూడా బంగారం, వెండి ధరలలో మార్పులు కొనసాగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్‌ రెడీ .. పవన్ కళ్యాణ్ స్వాగ్ మరో లెవెల్‌లో!
Mortgage Property | మార్ట్‌గేజ్ ఫ్లాట్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి సుమా..!