Mortgage Property | మార్ట్‌గేజ్ ఫ్లాట్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి సుమా..!

Mortgage Property | చాలా మంది మార్ట్‌గేజ్ ఆస్తుల‌ను( Mortgage Property ) కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఆస్తులు సాధార‌ణంగా 10 నుంచి 20 శాతం త‌క్కువ ధ‌ర‌కు లభిస్తాయి. కాబ‌ట్టి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు( Middle Class People ) మార్ట్‌గేజ్ ప్రాప‌ర్టీపై ఎక్కువ‌గా దృష్టిసారిస్తారు. మ‌రి ఈ ఆస్తులు కొనుగోలు చేసే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి సుమా..!

  • By: raj |    business |    Published on : Feb 28, 2026 8:28 AM IST
Mortgage Property | మార్ట్‌గేజ్ ఫ్లాట్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి సుమా..!

Mortgage Property | ఇటీవ‌లి కాలంలో చాలా మంది సొంతిల్లు( Own House ) క‌ల‌ను నిజం చేసుకునేందుకు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ సొంతిల్లు క‌ల అనేది అంద‌రికీ సాధ్యం కాదు. కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. ఇక మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు.. త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే ఇండ్ల‌పై ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇలా త‌క్కువ ధ‌ర‌లో వ‌చ్చే ఇండ్లు అంటే.. మార్ట్‌గేజ్ ప్రాప‌ర్టీ( Mortgage Property )నే ఉంటుంది. ఈ క్ర‌మంలో మార్ట్‌గేజ్ ఫ్లాట్‌ల‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు. మార్ట్‌గేజ్ ప్రాప‌ర్టీల‌న్నీ బ్యాంకు( Bank )లో తాక‌ట్టు పెట్టిన‌వే. అయితే తాక‌ట్టు పెట్టిన ఆస్తులు కొనుగోలు విష‌యంలో సాధార‌ణ ఆస్తుల కంటే భిన్న‌మైన నిబంధ‌న‌లు ఉంటాయి. అస‌లు మార్ట్‌గేజ్ ప్రాప‌ర్టీ అంటే ఏమిటి..? నిబంధ‌న‌లు ఏమిటి..? అనే విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

మార్ట్‌గేజ్ అంటే ఏమిటి..?

సామాన్యుడి భాష‌లో చెప్పాలంటే.. మార్ట్‌గేజ్ అంటే తాక‌ట్టు అని అర్థం. అంటే త‌మ వ‌ద్ద ఉన్న ఆస్తిని బ్యాంకులో తాక‌ట్టు పెట్టి.. అప్పు తెచ్చుకోవ‌డం. అయితే బ్యాంకు, ఆస్తి క‌లిగిన వ్య‌క్తి మ‌ధ్య జ‌రిగే ఒప్పందం. ఒక వ్య‌క్తి త‌న ఆస్తిని బ్యాంకులో త‌నాఖా పెట్టి.. ఆ ఆస్తికి త‌గ్గ న‌గ‌దును అప్పుగా తీసుకుంటారు. ఆ త‌ర్వాత ఆ ఆస్తిపై హ‌క్కులు బ్యాంకుకు చెందుతాయి. ఒక వేళ రుణం తీసుకున్న వ్యక్తి ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైతే, సదరు ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం బ్యాంకుకు ఉంటుంది.

మార్ట్‌గేజ్ ఎన్ని ర‌కాలు..?

దేశంలో రెండు ర‌కాల మార్ట్‌గేజ్ రుణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక‌టి కొత్త ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవ‌డానికి తీసుకునేది. రెండోది ఇప్ప‌టికే ఉన్న ఆస్తిని తాక‌ట్టు పెట్టి వ్యాపార అవ‌స‌రాలు, ఉన్న‌త చ‌దువులు లేదా వైద్య ఖ‌ర్చుల నిమిత్తం తీసుకునే రుణం.

మార్ట్‌గేజ్ ఆస్తుల వ‌ల్ల లాభాలేంటి..?

మార్ట్‌గేజ్‌లో ఉన్న ఆస్తుల‌ను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ప్ర‌ధానంగా మూడు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయితే తాక‌ట్టులో ఉన్న ఆస్తుల విలువ‌.. సాధార‌ణ ఆస్తుల కంటే కొంచె త‌క్కువ ధ‌ర‌కే ల‌భించ‌నున్నాయి. క‌నీసం 10 నుంచి 20 శాతం వ‌ర‌కు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి మార్ట్‌గేజ్ ఆస్తులు. కొనుగోలుదారుడికి రుణ భారం త‌ప్పుతుంది. ఇక స‌ద‌రు ఆస్తికి గ్యారెంటీ కూడా ఎక్కువే. ఎందుకంటే ఆస్తి ప‌త్రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాక‌, ఎలాంటి ఆటంకాలు లేవ‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత‌నే బ్యాంకులు మార్ట్‌గేజ్ లోన్ల‌ను ఇస్తుంటాయి. కాబ‌ట్టి మార్ట్‌గేజ్ ఆస్తుల‌కు భ‌ద్ర‌త ఉంటుంది. చాలా వరకు ఇలాంటి ఆస్తులు పూర్తి చేసి ఉంటారు. కొనుగోలు చేసిన వెంటనే గృహప్రవేశం చేయవచ్చు.

ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

మార్ట్‌గేజ్ ఆస్తులు కొనుగోలు చేసే స‌మ‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. ఒక‌టికి రెండుసార్లు డాక్యుమెంట్ల‌ను ప‌రిశీలించాలి. మొద‌టగా చేయాల్సింది ఏంటంటే.. య‌జ‌మాని వ‌ద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఫొటో కాపీలు తీసుకోవాలి. లోన్ ఎంత పెండింగ్ ఉంద‌నే విష‌యాల‌ను తెలుసుకోవాలి. లోన్ తీసుకున్న బ్యాంకు నుంచి అవుట్ స్టాండింగ్ లోన్ స్టేట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. రుణం మొత్తం చెల్లించిన త‌ర్వాత ఒరిజిన‌ల్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాన‌ని బ్యాంకు ఇచ్చే అంగీకార ప‌త్రాన్ని కూడా అడ‌గాలి. మీరు మొత్తం క్యాష్‌ చెల్లించి తీసుకుంటే మొదట బ్యాంకుకు వెళ్లి లోన్ సెటిల్ చేసి మిగతా అమౌంట్‌ ఓనర్‌కు ఇవ్వాలి. లోన్‌ ద్వారా తీసుకుంటే ముందు బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేయాలి. అప్పుడు ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. వేరే బ్యాంకులో తీసుకుంటే చెక్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ ప‌త్రాలు ఉంటేనే కొనుగోలు చేయాలి..!

ఆస్తి హక్కులను నిరూపించే సేల్‌డీడ్‌ కచ్చితంగా ఉండేలా చూడాలి. గత లావాదేవీలు చెప్పే ఈసీ అడగాలి. హోసింగ్ సొసైటీ లేదా బిల్డర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. యజమాని పన్నులు సక్రమంగా చెల్లించిన ప్రాపర్టీ టాక్స్ రిసీట్‌లు తీసుకోవాలి. భవనం అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం ఉందో లేదో నిర్దారించే శాంక్షన్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కావాలి.

కొనుగోలు చేసేటప్పుడు ఏం చేయాలి?

మొదట యజమాని వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఫొటో కాపీలు తీసుకోవాలి. అందులో పెండింగ్‌ లోన్ ఎంత ఉంది? ఎలక్ట్రిక్‌ ,వాటర్ బిల్లులు, మున్సిపల్‌ పన్నులు ఏమైనా బాకీలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. లోన్ తీసుకున్న బ్యాంక్ నుంచి అవుట్ స్టాండింగ్ లోన్ స్టేట్‌మెంట్ తీసుకోవాలి. లోన్ మొత్తం చెల్లించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్‌ ఇచ్చేస్తానని బ్యాంకు ఇచ్చే అంగీకార పత్రాన్ని కూడా అడగాలి. మీరు మొత్తం క్యాష్‌ చెల్లించి తీసుకుంటే మొదట బ్యాంకుకు వెళ్లి లోన్ సెటిల్ చేసి మిగతా అమౌంట్‌ ఓనర్‌కు ఇవ్వాలి. లోన్‌ ద్వారా తీసుకుంటే ముందు బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేయాలి. అప్పుడు ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. వేరే బ్యాంకులో తీసుకుంటే చెక్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పత్రాలు లేకుండా మార్ట్‌గేజ్‌ ఆస్తులు కొనొద్దు

ఆస్తి హక్కులను నిరూపించే సేల్‌డీడ్‌ కచ్చితంగా ఉండేలా చూడాలి. గత లావాదేవీలు చెప్పే ఎన్‌కంబ్రాన్స్ సర్టిఫికేట్‌ అంటే ఈసీ అడగాలి. హోసింగ్ సొసైటీ లేదా బిల్డర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. యజమాని పన్నులు సక్రమంగా చెల్లించిన ప్రాపర్టీ టాక్స్ రిసీట్‌లు తీసుకోవాలి. భవనం అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం ఉందో లేదో నిర్దారించే శాంక్షన్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కావాలి.

టోకెన్ అమౌంట్ ఎప్పుడు ఇవ్వాలి..?

మార్ట్‌గేజ్ ఆస్తుల విష‌యంలో కోర్టు కేసులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కేవ‌లం బ్యాంకు వెరిఫికేష‌న్‌పైనే ఆధార‌ప‌డ‌కుండా.. ఒక న్యాయ‌వాది ద్వారా చెక్ చేయించుకోవ‌డం బెట‌ర్. మార్ట్‌గేజ్ ఆస్తులు కొనేట‌ప్పుడు కొనుగోలుదారు, విక్రేత‌, బ్యాంకు ముగ్గురు సంత‌కాలు చేసే ఒప్పందం చేసుకోవ‌డం చాలా మంచిది. డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే టోకెన్ అమౌంట్ ఇవ్వాలి.