అవినీతి, అక్రమాలతో బ్యాంకు రుణాల చెల్లింపు చేసినట్లుగా తనపై వచ్చిన ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే కే. ప్రేమ్ సాగర్ రావు ఖండించారు. మంత్రి పదవి రేసులో ఉన్నాననే నాపై రాజకీయ కుట్రతో ప్రత్యర్థి పార్టీలతో పాటు జిల్లాకు చెందిన సొంత పార్టీ వారు సైతం అవినీతి ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అని, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని, త్వరలో అన్ని కుట్రలు బయటకు వస్తాయని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.
నాపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలి
నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నవారు తనతో ముఖాముఖీ చర్చలకు రావాలని ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. నేను నా వ్యాపార, వాణిజ్య కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి రూ.450 కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసి..వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. 2009-10లో బ్యాంక్ రూ.450 కోట్లు రుణాలు మంజూరీ కాగా, సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ లోను తీసుకున్నాం అన్నారు. యూఎస్ ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత నేను రూ. 160 కోట్లు లాస్ అయ్యానని,
నిజానిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తానని స్పష్టం చేశారు.
రూ.450 కోట్లు ప్రాడ్ చేస్తే బ్యాంకులు రూ.109 కోట్లకు ఎలా ఆక్షన్ వేస్తుందని, సాంక్షన్ ఆర్డర్స్ నేను క్రేయేట్ చేసినవి కాదుఅని, 2014 నుండి 2025 వరకు కంపెనీకి ఫండ్స్ వాడింది రూ.109 కోట్ల 11 లక్షలు అని, అన్ని బ్యాంకులు ఎన్ పీఏ ఇచ్చింది రూ.109 కోట్ల 11లక్షలు అని ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. ఆర్బీఐ, సెబీ రిజిస్టర్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నామని, 2014 నుండి 2025 వరకు రూ.44కోట్ల 81లక్షల పేమెంట్ చేశాం అని, రూ.168 కోట్లు 2014-15లో రీజర్వ్ ప్రైస్ ఉందని తెలిపారు. ఆంధ్ర బ్యాంక్ ఎన్ పీఏ అయిన తర్వాత రూ.18కోట్ల 72లక్షలు చెల్లించాం అన్నారుజ 2024 అక్టోబర్ 31 నుండి లోన్ పేమెంట్ చేశాం అని వెల్లడించారు.
పార్టీ కోసం ఎంతో సేవ చేశాను..
నేను పది ఏండ్లు ప్రతి పక్షంలో ఉండి కాంగ్రెస్ కోసం పోరాటం చేశానని, అంతకుముందు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అధికార దుర్వినియోగం చేయలేదు అని ప్రేమసాగర్ రావు చెప్పుకొచ్చారు. నేను సాండ్,లాండ్, ముడుపులు తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునే వాడినన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత నిధులతో నేను 15 స్కూల్స్ కట్టించానని తెలిపారు. నేను దేనిపైనా, ఎవరిపైనా బేస్ లెస్ ఫిర్యాదు చేయనని, అలాగే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపైన, పత్రిక సంస్థలపైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.