Nitin Gadkari | కారు హారన్‌గా ఢోలక్ సౌండ్ కావాలా? ఫ్లూట్ మ్యూజిక్ కావాలా? గడ్కరీ వ్యాఖ్యలతో నెట్టింట రచ్చ రచ్చ
అదే జరిగితే ఇక ట్రాఫిక్ జామ్‌లు మ్యూజిక్ జామ్స్‌గా మారిపోతాయని, వాహనాల్లోని వారు లయబద్ధంగా హారన్ మోగిస్తుంటే.. రోడ్లపై ఇక జుగల్బందీయేనని ఒక నెటిజన్ కామెంటాడు. ‘మీ వెనుక వస్తున్న వాహనదారుడు దారి ఇవ్వాలంటూ హారన్ కొడితే.. ఆ సంగీతం వింటూ మైమరిచిపోతే ఏం జరుగుతందో ఊహించండి..’ అంటూ మరో యూజర్ డౌటేశాడు.

Nitin Gadkari | ఇప్పటిదాకా వాహనాలకు కికీక్.. కికీక్.. అనే బోరింగ్ సౌండ్లే ఉంటున్నాయి. అంతకు ముందు బస్సులు, ఆటోలకు పువాయ్.. పువాయ్.. అనే సౌండ్లు వచ్చేవి. ఇకపై మీరు ఢోలక్ మోగించినట్టు, లేదా తబలా వాయించినట్టు.. అదీ కాకుంటే ఫ్లూటు తరహాలో వాహనాల హారన్‌లు వినొచ్చు. ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికర ప్రకటనను కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితన్ గడ్కరీ చేశారు. వాహనాలకు పూర్తిగా భారతీయ సంగీత వాయిద్యాల తరహాలో హారన్‌లు ఉండేలా ఒక చట్టం తెచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆటోమొబైల్ మార్కెట్‌లో జపాన్‌ను అధిగమించి మూడో స్థానానికి భారతదేశం చేరుకున్న నేపథ్యంలో ఈ ఆలోచన ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది.
ఢిల్లీలో ఒక పత్రిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన ఈ ఆలోచన గురించి చెప్పారు. భారత సంగీత వాయిద్యాలైన ఫ్లూట్, తబలా, వయోలిన్, హర్మోనియం వంటి ధ్వనులు వినడానికి సొంపుగా ఉంటాయని ఆయన చొప్పుకొచ్చారు. ఈయన ఈ మాట అలా వదిలారో లేదో.. నెట్టింట రచ్చ రేగింది.
అదే జరిగితే ఇక ట్రాఫిక్ జామ్‌లు మ్యూజిక్ జామ్స్‌గా మారిపోతాయని, వాహనాల్లోని వారు లయబద్ధంగా హారన్ మోగిస్తుంటే.. రోడ్లపై ఇక జుగల్బందీయేనని ఒక నెటిజన్ కామెంటాడు. ‘మీ వెనుక వస్తున్న వాహనదారుడు దారి ఇవ్వాలంటూ హారన్ కొడితే.. ఆ సంగీతం వింటూ మైమరిచిపోతే ఏం జరుగుతందో ఊహించండి..’ అంటూ మరో యూజర్ డౌటేశాడు. కొందరు యూజర్లైతే వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని కామెంట్లు చేశారు. ‘ఒక పేద దేశం ప్రాధాన్యం.. కారు హారన్ భారతీయ సంగీత వాయిద్యాలతో ఉండటం’ అంటూ చురకలేశారు. నచ్చిన హారన్లు మోగించడం శిక్షార్హమైన నేరమైన నేపథ్యంలో చట్టం సంగతేంటి? అని మరొకరు సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో హారన్ అనేది ఎదుటివారిని అప్రమత్తం చేసేందుకు లేదా సిగ్నల్ ఇచ్చేందుకని, అంతేకానీ.. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదని చురకలేశారు.
ఇదంతా ప్రమాదాన్ని లేదా ముప్పును తప్పించేందుకే హారన్ వాడాలని భారత మోటర్ వెహికల్స్ చట్టం 1988 చెబుతున్నది. ఇదెలా ఉన్నా.. కొందరు మాత్రం గతంలో ఒకసారి ఢిల్లీలో ఆటోవాలా తన ఆటో వెనుక కౌన్ బనేగా కరోడ్ పతి స్టయిల్‌లో రాసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దాని వెనుక ఏం రాసి ఉందో మీరు మాత్రం కేబీసీలో అమితాబ్‌లా చదువుకోండి..
ట్రాఫిక్ మే హారన్ బజానే సే క్యా హోతా హై? మీ ఆప్షన్స్..
ఏ : గ్రీన్ లైట్ వెలుగుతుంది..
బీ : రోడ్డు వెడల్పు అవతుంది..
సీ : వాహనాలు గాల్లోకి ఎగురుతాయి..
డీ : ఏమీ జరగదు!