Rudrama V.01 Model Rocket | మోడల్ రాకెట్ ట్రయల్ రన్ సక్సెస్

వరంగల్ భద్రకాళి బండ్ వద్ద మోడల్ రాకెట్ ట్రయల్ రన్ విజయవంతం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం పూర్తి స్థాయి ప్రయోగం జరగనుంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 28, 2026, 1:12 pm IST
Read Time: 3 mins
Rudrama V.01 Model Rocket | మోడల్ రాకెట్ ట్రయల్ రన్ సక్సెస్

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ భద్రకాళి బండు వద్ద మోడల్ రాకెట్ ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ కోసం ఏర్పాట్లు చేయగా భద్రకాళి చెరువులోని ఐలాండ్ వద్ద నమూనా రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి ట్రయల్ రన్ ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ డైరెక్టర్ ఎన్. రఘునందన్ కుమార్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ బీమ్ రావు, సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, హనుమకొండ ఏసిపి నరసింహారావు, తదితరుల సమక్షంలో రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 28 ( శనివారం) సాయంత్రం ఐదున్నర గంటలకు మోడల్ రాకెట్ ను భద్రకాళి బండ్ నుండి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంతో చారిత్రక వరంగల్ నగరం సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. అదేవిధంగా శనివారం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు నిర్వహించే సెమినార్ లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివిధ అంశాలపై వక్తలు ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి సెమినార్ కు పరిమిత సంఖ్యలో అనుమతి కలదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Hair Double Wash | హెయిర్ వాష్ రెండుసార్లు చేసుకోవాలా..? డెర్మ‌టాల‌జిస్ట్‌లు ఏం చెబుతున్నారు..?
Vijay | దళపతి విజయ్‌కు భార్య సంగీత విడాకుల పిటీషన్… ఆ న‌టితో అక్రమ సంబంధ‌మే కార‌ణ‌మా?