Hair Double Wash | హెయిర్ వాష్ రెండుసార్లు చేసుకోవాలా..? డెర్మటాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారు..?
చాలా మంది తలస్నానం చేసినప్పుడు రెండుసార్లు షాంపూ (shampooing) చేస్తే (Hair Double Wash).. మరికొంతమంది ఒక్కసారే చేస్తారు. ఎందుకంటే అన్నిసార్లు షాంపూ యూజ్ చేస్తే జుట్టు పాడైపోతుందనుకుంటుంటారు.
ప్రస్తుతం యువత తమ చర్మం, జుట్టు (Hair) సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. మార్కెట్‌లో దొరికే కొత్తకొత్త ప్రాడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొందరు కంటెంట్ క్రియేటర్స్ చర్మం, జుట్టు సంరక్షణకు తాము పాటించే చిట్కాలను కూడా తరచూ పంచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో హెయిర్ డబుల్ వాష్ ఒకటి (Hair Double Wash). చాలా మంది తలస్నానం చేసినప్పుడు రెండుసార్లు షాంపూ చేస్తే.. మరికొంతమంది ఒక్కసారే చేస్తారు. ఎందుకంటే అన్నిసార్లు షాంపూ యూజ్ చేస్తే జుట్టు పాడైపోతుందనుకుంటుంటారు.
డబుల్ వాష్ చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని డెర్మటాలజిస్ట్‌లు (Dermatologist) సూచిస్తున్నారు. తలస్నానం చేసేటప్పుడు డబుల్ వాష్ (రెండుసార్లు షాంపూ) చేయడం వల్ల మాడు (scalp)పై పేరుకుపోయిన అధిక నూనె, దుమ్ము, కాలుష్యంతో పేరుకుపోయిన పదార్థాలు, చుండ్రు పూర్తిగా తొలగిపోతాయట. జుట్టు కుదుళ్ల నుంచి క్లీన్ అవుతుందని, ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ప్రత్యేకించి ఆయిల్ స్కాల్ప్ ఉన్నవారికి ఇది చాలా మంచిదని సూచిస్తున్నారు.
డబుల్ వాష్‌తో లాభాలు..
“రోజంతా మన మాడుపై సెబమ్ (సహజ నూనె), చెమట, దుమ్ము, పర్యావరణ కాలుష్య కారకాలు, సీరమ్స్, డ్రై షాంపూ, జెల్స్ వంటి స్టైలింగ్ ఉత్పత్తుల అవశేషాలు పేరుకుపోతాయి. మొదటిసారి వాష్ చేసినప్పుడు పైపైనున్న ఈ మలినాలు తొలగిపోతాయి. రెండో వాష్‌తో షాంపూ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. స్కాల్ప్, జుట్టు మరింత దృఢంగా మారుతాయి. అందుకే డబుల్ క్లెన్సింగ్‌తో మెరుగైన ఫలితాలు ఉంటాయి” అని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. అయితే, మనం వాడే షాంపూను బట్టి ఫలితాలు ఉంటాయని తెలిపారు.
ఎవరు డబుల్ వాష్ చేయాలి..?
ఆయిలీ స్కాల్ప్ ఉన్న వారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగేవారు, రకరకాల హెయిర్ స్టైలింగ్ ప్రాడక్ట్స్‌ను వాడే వారు డబుల్ వాష్ చేయాలని సూచిస్తున్నారు. మాడుపై వ్యర్థాలు అలాగే పేరుకుపోతే, అవి జుట్టు కుదుళ్లను (Hair follicles) మూసివేస్తాయి. దీనివల్ల మాడుపై ఉండే సహజ సూక్ష్మజీవుల సమతుల్యత (Microbiome) దెబ్బతిని, మంట లేదా దురదకు దారితీస్తుంది. ఇది చివరికి చుండ్రు, జుట్టు నిర్జీవంగా మరడానికి కారణమవుతుంది. అందుకే బయట తిరిగే వాళ్లు తలస్నానం చేసినప్పుడు డబుల్ వాష్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఎవరు చేయకూడదు..?
డబుల్ క్లెన్సింగ్ అందరికీ అవసరం లేదని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. డ్రై హెయిర్, సెన్సిటివ్ స్కాల్ప్, కర్లీ హెయిర్, కెమికల్ ట్రీట్‌మెంట్ చేయించుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. క్లెన్సింగ్ అతిగా చేయడం వల్ల జుట్టుకు అవసరమైన సహజ నూనెలు పోతాయని, స్కాల్ప్ రక్షణ కవచం బలహీనపడుతుంది. దీనివల్ల చర్మం పొడిబారడం, మంట పుట్టడం వంటి వాటికి దారితీస్తాయి.
ఇవి కూడా చదవండి :
Virosh | విజయ్-రష్మిక పెళ్లి పోస్ట్ రికార్డు బ్రేక్.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా మార్క్ దాటేసిన క్యూట్ కపుల్
Allu Arjun | అల్లు అర్జున్ రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్.. ఆ టైమ్‌లో తెగ ఏడుస్తాడట..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram