Virosh | విజ‌య్-ర‌ష్మిక‌ పెళ్లి పోస్ట్ రికార్డు బ్రేక్.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా మార్క్ దాటేసిన క్యూట్ క‌పుల్‌

Virosh | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్ విషయంలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజయానంతరం ఆయన చేసిన పోస్ట్ 23 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి, ఇండియాలో అత్యధిక లైక్స్ పొందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా నిలిచింది.

  • By: sn |    movies |    Published on : Feb 28, 2026 12:33 PM IST
Virosh | విజ‌య్-ర‌ష్మిక‌ పెళ్లి పోస్ట్ రికార్డు బ్రేక్.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా మార్క్ దాటేసిన క్యూట్ క‌పుల్‌

Virosh | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్ విషయంలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజయానంతరం ఆయన చేసిన పోస్ట్ 23 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి, ఇండియాలో అత్యధిక లైక్స్ పొందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా నిలిచింది. అయితే ఆ రికార్డును ఇప్పుడు ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి.

కోహ్లీ రికార్డ్ బ‌ద్ద‌లు..

రష్మిక మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పెళ్లి ఫోటోలు కేవలం 30 గంటల్లోనే 23.4 మిలియన్ల లైక్స్ సాధించి, ఇండియాలో అత్యధిక లైక్స్ పొందిన పోస్ట్‌గా కొత్త రికార్డు సృష్టించాయి. మరోవైపు విజయ్ దేవరకొండ తన ఖాతాలో చేసిన పెళ్లి పోస్ట్‌కి 18.6 మిలియన్ల లైక్స్ వచ్చాయి. మొత్తంగా ఈ జంట పెళ్లి ఫోటోలకు 42 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం. ఓవరాల్‌గా కూడా ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన పెళ్లి పోస్ట్‌గా ఇది నిలిచింది.

ఇంతకుముందు కియారా అద్వాని- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా పెళ్లి ఫోటోలకు 16 మిలియన్ల లైక్స్ రాగా, ర‌ణ‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్ వివాహ పోస్ట్‌కి 13 మిలియన్ల లైక్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్న స‌మంత‌-రాజ్ నిడిమోరు జంట ఫోటోలకు 12 మిలియన్ల లైక్స్ నమోదయ్యాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఉదయం 10:10 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన మెడలో తాళి కట్టాడు. సాయంత్రం పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఎమోష‌న‌ల్ కామెంట్స్..

విజయ్ తన పోస్ట్‌లో భావోద్వేగంగా స్పందిస్తూ, “ఒక రోజు ఆమె నాతో ఉంటే ఆ రోజు మరింత బాగుండేదని అనిపించేది. ఆమెతో ఉంటే ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే భార్యగా చేసుకున్నా” అంటూ రాశాడు. రష్మిక కూడా తన ఇన్‌స్టా పోస్టులో, “హాయ్ మై లవ్స్, మీకు నా భర్తను పరిచయం చేస్తున్నా – మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పించిన వ్యక్తి. నా కలలు నెరవేర్చేలా నమ్మకం ఇచ్చిన మనిషి. ఇప్పుడు నేను అతనిదాన్ని. నా జీవితంలో అతి పెద్ద భాగం. మనం కలిసి ఉత్తమ జీవితాన్ని గడుపుదాం” అంటూ భావోద్వేగంగా పంచుకుంది.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌లు వైరల్ అవుతూ అభిమానుల నుండి అపారమైన స్పందనను అందుకుంటున్నాయి. ఇండియన్ సెలబ్రిటీ వెడ్డింగ్స్‌లో కొత్త సోషల్ మీడియా రికార్డును ఈ జంట సృష్టించింది.