Allu Arjun | అల్లు అర్జున్ రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌.. ఆ టైమ్‌లో తెగ ఏడుస్తాడ‌ట‌..!

Allu Arjun | ఒకప్పుడు స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్,. ‘Pushpa: The Rise’ విజయంతో ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. ఇప్పుడీ దర్శకుడు అట్లీతో చేయబోతున్న ‘ఏఏ 22’ ప్రాజెక్ట్‌తో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

  • By: sn |    movies |    Published on : Feb 28, 2026 11:43 AM IST
Allu Arjun |  అల్లు అర్జున్ రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌.. ఆ టైమ్‌లో తెగ ఏడుస్తాడ‌ట‌..!

Allu Arjun | ఒకప్పుడు స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్,. ‘Pushpa: The Rise’ విజయంతో ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. ఇప్పుడీ దర్శకుడు అట్లీతో చేయబోతున్న ‘ఏఏ 22’ ప్రాజెక్ట్‌తో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ సెట్స్ న‌డుమ‌ ఎక్కువ భాగం షూటింగ్ జరగనుండగా, కొంత భాగం విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, బన్నీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర వ్యక్తిగత విషయాలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

అది చూసి ఏడ్చేస్తాడు..

తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఒక ఇంటర్వ్యూలో ఇంట్లో అల్లు అర్జున్ ఎలా ఉంటారన్న విషయాలను పంచుకున్నారు. కొన్నాళ్ల క్రితం స‌మంత‌ హోస్ట్‌గా నిర్వహించిన ‘సామ్ జామ్’ షోలో బన్నీ–అరవింద్ కలిసి పాల్గొని పలు సరదా విషయాలు వెల్లడించారు. సినిమా చూస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్లు వస్తే ముందుగా కన్నీళ్లు పెట్టేది అల్లు అర్జునేనని అరవింద్ తెలిపారు. ఆయన చాలా సెన్సిటివ్ వ్యక్తి అని చెప్పారు. ఇంట్లో ఎక్కువగా సౌండ్ చేసేది, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేది కూడా బన్నీయేనని వెల్లడించారు. అంటే ఇంట్లో హడావుడి అంతా ఆయనదే అన్నమాట.

ఖర్చుల్లోనూ ఫస్ట్!

ఇంట్లో ఎక్కువగా ఖర్చు చేసేది ఎవరని అడిగితే, సందేహం లేకుండా అల్లు అర్జున్ పేరే చెప్పారు అరవింద్. దీనిపై బన్నీ సరదాగా స్పందిస్తూ, “తండ్రి సంపాదిస్తే కొడుకు ఖర్చు చేయాలి కదా!” అంటూ నవ్వించారు. అలాగే ఇంట్లో ఫైనల్ డిసిషన్ కూడా ఎక్కువగా బన్నీయేనని అరవింద్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రిలీజ్ రోజు టెన్షన్!

అరవింద్ చెప్పిన మరో ముఖ్య విషయం ఏంటంటే సినిమా రిలీజ్ రోజు బన్నీ ఫుల్‌ టెన్షన్‌లో ఉంటారట. ఆ రోజు ఎవ్వరినీ కలవకుండా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారని తెలిపారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నారు. బయటికి ఎంతో ధైర్యంగా కనిపించే బన్నీ, సినిమాపై మాత్రం చాలా సీరియస్‌గా, బాధ్యతగా వ్యవహరిస్తారని ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడీ పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. అభిమానులు బన్నీ వ్యక్తిత్వంలోని ఈ సెన్సిటివ్ కోణాన్ని మరింతగా అభిమానిస్తున్నారు. ఇక ‘ఏఏ 22’ ప్రాజెక్ట్‌తో ఆయన ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.