Warangal | వరంగల్ అభివృద్ధిపై చిగురించిన ఆశలు!

ఉమ్మడి వరంగల్ జిల్లాకు, కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులొచ్చాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రతినిధుల మధ్య ఇంతకాలం బహిరంగంగా కొనసాగిన విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టి తాజాగా నాయకులంతా ఐక్యతను ప్రదర్శించడంతో ఇక ‘అభివృద్ధి’ పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Warangal | వరంగల్ అభివృద్ధిపై చిగురించిన ఆశలు!

అడుగందీ….అమ్మైనా అన్నం పెట్టదేమో?
కాంగ్రెస్ నాయకులంతా ఏకమయ్యారూ!
విభేదాలు వీడి వేం కు ఘన సన్మానం చేశారు!
అభివృద్ధి పై దృష్టి పెట్టాలని పలువురి ఆకాంక్ష
సీఎం రేవంత్ కు ప్రతిపాదించడమే మిగిలిందీ!

Warangal | విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాకు, కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులొచ్చాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రతినిధుల మధ్య ఇంతకాలం బహిరంగంగా కొనసాగిన విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టి తాజాగా నాయకులంతా ఐక్యతను ప్రదర్శించడంతో ఇక ‘అభివృద్ధి’ పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ పక్షాన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ప్రభుత్వం ముందూ.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ప్రత్యేకంగా అభివృద్ధి అంశాలు ప్రతిపాదించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చూ. విభేదాల కారనంగా నేతలంతా కలిసి సమస్యలపై ఉమ్మడిగా చర్చించిన దాఖలాలు తక్కువ. ప్రస్తుతం నాయకుల మధ్య సఖ్యత నెలకొన్నందున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఉమ్మడి జిల్లాకు అదనపు నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు తెచ్చుకునే అవకాశం ఉందంటున్నారు.

నేతల మధ్య విభేదాలతో నష్టం

ఉమ్మడి వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ హయాంలో ఆరు జిల్లాలుగా విభజించడంతో అనుకూలతలతోపాటు, ప్రతికూలతలూ ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలూ, ఎంపీలూ, ఎమ్మెల్సీల మధ్య ఐక్యత సన్నగిల్లిందనే అభిప్రాయం ఉంది. ఒకే ఎమ్మెల్యే ప్రాతినిధ్యంతో ఒక జిల్లా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో ఎన్నికైనా ఎంపీలూ, ఎమ్మెల్యేల మధ్య ‘విభజన’ పెరిగిపోయింది. ఎవరికి వారు తమ జిల్లా, తమ నియోజకవర్గం అభివృద్ధి అనే పరిధికి కుంచించుకపోయారు. దీంతో ఐక్యతతోపాటు బలం కూడా తగ్గిపోయి ‘ సీఎం వద్ద, ప్రభుత్వం వద్ద’ పరపతి కూడా సన్నగిల్లిందీ. చివరికి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రులు కూడా తమతమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.

ఒక వైపు ఈ భౌతిక పరిస్థితికి తోడూ, ఇక్కడి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో కూడా నష్టం వాటిల్లింది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు, బహిరంగ దూషణలు, విమర్శల ఫలితంగా ఉన్న కాస్తో.. కూస్తో ‘స్నేహం’ సైతం చెడిపోయింది. మూడేళ్ళపాటు విభేదాలతోనే కాలం వెల్లదీశారు. దీంతో అధికార పుణ్యకాలం ఇప్పటికే పూర్తి కావస్తోందంటున్నారు.

నాయకుల మధ్య ఏర్పడిన ఈ విభేదాలతో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అంశాల పైగానీ, నియోజకవర్గం, జిల్లాలకు సంబంధించిన నిధులు, అభివృద్ధి అంశాలను ఎవరికివారుగానే, సీఎం రేవంత్, ఇతర మంత్రుల వద్ద ప్రతిపాదనలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికతో కూడిన ప్రతిపాదనలను సీఎం ముందు ప్రతిపాదించే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మంత్రులు కూడా ఎవరికివారుగానే తమ తమ నియోజకవర్గాలకు పరిమితమై వ్యవహరిస్తూ వచ్చారు. సీఎం స్పందిస్తే నిధులొచ్చాయి… లేకుంటే లేదనే పరిస్థితి ఏర్పడింది.

విభేదాలూ వీడి…. కలిసి అడుగులు

కారణమేదైనా… ఇటీవల కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కన పెట్టారు. మొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో ‘విందు రాజకీయం’తో ఒక్కడుగు ముందుకు వేశారు. అందరికీ కావాల్సిన వాడిగా, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికైనా నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభకు ఒకరిద్దరు మినహా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులంతా హాజరయ్యారు. నిర్వహణ ఎవరనేది పక్కన పెడితే నాయకులు ఐక్యతను ప్రదర్శించారు. దీంతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు రేగాయి.

ఇదే సానుకూల పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కావాల్సిన అభివృద్ధి అంశాలపై ఈ నాయకులంతా కలిసికట్టుగా చర్చించి, ఒక ప్రతిపాదన రూపొందించి, సీఎం వద్దకు వెళ్ళి దాని అమలుకు నిధులు విడుదల చేసి సహకారించాలని అడిగితే మరో అడుగు ముందుకు పడుతోందంటున్నారు. దీని వల్ల వరంగల్ జిల్లా అభివృద్ధితో పాటు తమతమ నియోజకవర్గాల్లోనూ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్కలతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సహకారంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యీలు, పార్టీ నాయకులంతా సీఎంతో కలిసి సమావేశమై జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను, ప్రతిపాదనలను పెట్టడం వల్ల అవసరమైన సందర్భంలో ఆ ప్రాజెక్టులకు ప్రాణం పోయడమో? కావాల్సిన నిధులు కేటాయించే అవకాశాలుంటాయని సూచిస్తున్నారు.

అడుగంది… అమ్మైనా అన్నం పెట్టదన్నట్లూ…. ఇంత కాలం తమలోని విభేదాలతో ఎవరికివారుగా తమ సమస్యలు విన్నవించినదాని కంటే కలిసికట్టుగా ఉమ్మడి జిల్లా పై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళితే ప్రయోజనం లభిస్తుందంటున్నారు. మంత్రులతో పాటు మాజీ మంత్రులు కడియం, సీనియర్ నాయకులు రేవూరి, బలరామ్ నాయక్, బస్వరాజులతో పాటు కొత్తగా ఎన్నికైన వారిని కలుపుకుని జిల్లా అభివృద్ధికి ముందడుగు వేయాలని కోరుకుంటున్నారు.!!!

Read More:

Hyderabad Metro | మెట్రో కు రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్‌సీ తో తెలంగాణ రుణ ఒప్పందం

రైతులకు క్షమాపణలు చెబుతున్నాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి