SIIMA Awards 2025 | సైమా అవార్డ్స్‌ 2025 – పుష్ప2, కల్కి ల జోరు ​

దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్‌ 2025లో పుష్ప 2, కల్కి 2898 ఏడీ చిత్రాలు ప్రధాన అవార్డులు దక్కించుకున్నాయి. అల్లు అర్జున్‌, రష్మిక ఉత్తమ నటీనటులుగా నిలిచారు.

SIIMA Awards 2025 | సైమా అవార్డ్స్‌ 2025 – పుష్ప2, కల్కి ల జోరు ​

SIIMA Awards 2025 | దుబాయ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో శుక్రవారం (సెప్టెంబర్‌ 5) సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (SIIMA) 2025 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో 2024లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో సత్కారం పొందారు.
“పుష్ప 2: ది రూల్” (Pushpa 2) మరియు “కల్కి 2898 ఏడీ” (Kalki 2898 AD) చిత్రాలు ప్రధాన అవార్డులను దక్కించుకుని ఈ వేడుకలో మెరిశాయి.

ప్రధాన అవార్డులు (తెలుగు విభాగం)

  • ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ (వైజయంతీ మూవీస్)
  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప 2: ది రూల్)
  • ఉత్తమ నటి: రష్మిక మందన్నా (పుష్ప 2: ది రూల్)
  • ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప 2: ది రూల్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్‌ (పుష్ప 2: ది రూల్)
  • ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
  • ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే – దేవర)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: శంకర్‌ బాబు కందుకూరి (పీలింగ్స్‌ – పుష్ప 2)
  • ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్‌ (చుట్టమల్లే – దేవర)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజా సజ్జా (హనుమాన్‌)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)
  • ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)
  • ఉత్తమ డెబ్యూ నటుడు: సందీప్‌ సరోజ్‌ (కమిటీ కుర్రోళ్లు)
  • ఉత్తమ డెబ్యూ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్‌ బచ్చన్‌)
  • ఉత్తమ డెబ్యూ దర్శకుడు: నందకిషోర్‌ యెమాని (35 ఒక చిన్నకథ)
  • ఉత్తమ డెబ్యూ నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
  • ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా: అశ్వినీదత్‌ (వైజయంతీ మూవీస్‌ 50 ఏళ్లు పూర్తి)

ప్రధాన అవార్డులు (కన్నడ విభాగం)

  • ఉత్తమ చిత్రం: కృష్ణం ప్రణయ సఖి
  • ఉత్తమ నటుడు: కిచ్చా సుదీప్‌
  • ఉత్తమ నటి: ఆషిక రంగనాథ్‌
  • ఉత్తమ దర్శకుడు: ఉపేంద్ర (UI)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోకనాథ్‌ (MAX)
  • ఉత్తమ హాస్యనటుడు: జాక్‌ సింఘం (భీమా)
  • ఉత్తమ డెబ్యూ నటుడు: సమర్జిత్‌ లంకేష్‌ (గౌరి)
  • ఉత్తమ డెబ్యూ నటి: అంకితా అమర్‌
  • ప్రామిసింగ్‌ న్యూ కమర్: సంయా అయ్యర్‌ (గౌరి)
  • ఉత్తమ డెబ్యూ దర్శకుడు: సందీప్‌ సుంకడ్‌ (శాఖకారి)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్: శ్రీవత్సన్‌ సెల్వరాజన్‌ (ఇబ్బని తబ్బిద ఇల్లేయళి)

2025 సైమా అవార్డులు దక్షిణాది సినిమా ప్రతిభను మళ్లీ ఒకసారి ప్రపంచ వేదికపై చాటాయి. “పుష్ప 2”లో నటనతో అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా విజేతలుగా నిలవగా, “కల్కి 2898 ఏడీ” ఉత్తమ చిత్రంగా ఘనత సాధించింది. ఇక “హనుమాన్‌”, “దేవర” వంటి చిత్రాలు కూడా సాంకేతిక విభాగాల్లో గుర్తింపు తెచ్చుకున్నాయి.