రాష్ట్రంలో ‘సై’.. ఢిల్లీలో ‘నై’ అంటున్న బీజేపీ : ఆది శ్రీనివాస్
బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు చేపట్టి బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో శనివారం వేములవాడలో ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టారు. తెల్లవారుజామున నుంచే బస్సులు బయటకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు.

విధాత, వేములవాడ : బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు చేపట్టి బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో శనివారం వేములవాడలో ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టారు. తెల్లవారుజామున నుంచే బస్సులు బయటకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. వేములవాడలో కొనసాగుతున్న బంద్ పరిస్థితిని స్వయంగా బైక్‌పై వెళ్లి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ప్రధాని మోదీ దగ్గర బీసీ రిజర్వేషన్లపై మాట్లాడలేక పోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ‘సై’ అంటున్న బీజేపీ నేతలు డిల్లీలో ‘నై’ అంటున్నారని ధ్వజమెత్తారు. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల నిరసనలకు బీఆర్‌ఎస్ నేతలు మద్దతు ఇవ్వలేకపోయారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నియోజకవర్గ పార్టీ యూత్ అధ్యక్షుడు న్యాత నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరం వెంకటస్వామి, గూడూరి మధు, పుల్కం రాజు, బింగి మహేష్, కూరగాయల కొమురయ్య, మైలారం రాము, చిలక రమేశ్, సీపీఎం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.