NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోలు త‌గ్గాడా.. కొత్త లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్

NTR | పాత్ర కోసం తన శరీరాన్ని, లుక్‌ను పూర్తిగా మార్చుకునే హీరోల్లో ముందుండే పేరు ఎన్టీఆర్‌. కెరీర్ ప్రారంభంలో రాఖీ, నా అల్లుడు వంటి సినిమాల సమయంలో కొంచెం లావుగా కనిపించిన ఆయనపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తనపై తాను కష్టపడి పూర్తిగా మారిపోయాడు. ముఖ్యంగా టెంపర్ సినిమాలో ఫిట్ లుక్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 11, 2026 12:17 PM IST
NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోలు త‌గ్గాడా.. కొత్త లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్

NTR | పాత్ర కోసం తన శరీరాన్ని, లుక్‌ను పూర్తిగా మార్చుకునే హీరోల్లో ముందుండే పేరు ఎన్టీఆర్‌. కెరీర్ ప్రారంభంలో రాఖీ, నా అల్లుడు వంటి సినిమాల సమయంలో కొంచెం లావుగా కనిపించిన ఆయనపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తనపై తాను కష్టపడి పూర్తిగా మారిపోయాడు. ముఖ్యంగా టెంపర్ సినిమాలో ఫిట్ లుక్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘టెంపర్’ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ మధ్య మధ్యలో వాయిదాలు పడుతూ కొంత నెమ్మదిగా సాగుతోంది.

ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన చాలా సన్నగా కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడ తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ సినిమాలోని పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా 18 కిలోలు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం ఐదు నెలల్లోనే కఠినమైన డైట్ మరియు వ్యాయామంతో ఈ బరువు తగ్గినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. పాత్రకు తగ్గట్టు కనిపించేందుకు ఆయన చేసిన ఈ మార్పు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

అయితే ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపించడంతో కొందరు అభిమానులు కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల్లో ప్రభాస్, యశ్ వంటి హీరోలను బలమైన, ఫిట్ బాడీతో చూపించాడు. అలాంటప్పుడు ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఇక ఈ సినిమాను ముందుగా జూన్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం షూటింగ్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. దీంతో విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది? దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయనను ఎలాంటి కొత్త అవతార్‌లో చూపించబోతున్నారు? అన్న విషయాలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.