Vijay-Trisha | నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విజయ్–త్రిష రిలేష‌న్.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు

Vijay-Trisha | తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నాయకుడు విజ‌య్ చుట్టూ వివాదాలు కొనసాగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన స్థాపించిన పార్టీ త‌మిళగ వెట్రి క‌గ‌జం రాజకీయ రంగంలో చురుకుగా మారుతున్న తరుణంలో, ఇటు రాజకీయంగా అటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి.

  • By: Sandeep |    movies |    Published on : Mar 11, 2026 7:37 AM IST
Vijay-Trisha | నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విజయ్–త్రిష రిలేష‌న్.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు

Vijay-Trisha | తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నాయకుడు విజ‌య్ చుట్టూ వివాదాలు కొనసాగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన స్థాపించిన పార్టీ త‌మిళగ వెట్రి క‌గ‌జం రాజకీయ రంగంలో చురుకుగా మారుతున్న తరుణంలో, ఇటు రాజకీయంగా అటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి.ఇప్పటికే కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో విజయ్‌కు మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో అంశం కూడా పెద్ద చర్చకు దారితీసింది.

ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన కలిసి ఒకే కారులో రావడం సోషల్ మీడియాలో పెద్ద దుమారంగా మారింది. ఈ ఘటనపై తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా దర్శకుడు, నటుడు ఆర్ పార్థిబ‌న్ సహా మరికొందరు సినీ ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు త్రిష కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

దీంతో విజయ్–త్రిష అంశం తమిళ రాజకీయాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై స్పందించిన విజయ్, ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మరోవైపు త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆమె త్వరలోనే టీవీకే పార్టీలో చేరి చెన్నై నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఆయన భార్య సంతీగ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. చెన్నైలో ఉన్న తన భర్త నివసిస్తున్న ఇంట్లో తాను ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరినట్టు తెలుస్తోంది. దీంతో విజయ్ చుట్టూ రాజకీయ, వ్యక్తిగత అంశాలు కలగలిపి మరింత చర్చకు దారితీస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, సినీనటి ఖుష్బూ ఈ వివాదంపై స్పందించారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను మీడియా ప్రతినిధులు విజయ్–త్రిష వివాదం రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అని ప్రశ్నించారు.దీనికి సమాధానంగా ఖుష్బూ మాట్లాడుతూ, అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో కలిపి చూడడం సరైంది కాదన్నారు. ప్రజలు ఎవరు తమ నాయకుడిగా ఉండాలి, ఎవరికి ఓటు వేయాలి అనే విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారని ఆమె తెలిపారు.