Malaika Arora | మళ్లీ ప్రేమలో మలైకా అరోరా… యువ నటుడితో చెట్టాపట్టాలు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్
Malaika Arora | బాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే సెలబ్రిటీలలో ఒకరు మలైకా అరోరా. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి చర్చకు దారి తీసింది. యువ నటుడు సోరభ్ బేడితో కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మలైకా మళ్లీ ప్రేమలో పడిందా అనే ప్రశ్నలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Malaika Arora | బాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే సెలబ్రిటీలలో ఒకరు మలైకా అరోరా. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి చర్చకు దారి తీసింది. యువ నటుడు సోరభ్ బేడితో కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మలైకా మళ్లీ ప్రేమలో పడిందా అనే ప్రశ్నలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో మలైకాకు చెందిన రెస్టారెంట్‌లో జరిగిన ఒక వేడుకకు సోరబ్ బేడీ హాజరయ్యాడు. ఆ వేడుకలో మలైకాతో కలిసి డ్యాన్స్ చేస్తూ, సంతోషంగా గడిపిన క్షణాలను అతను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ఫోటోలను షేర్ చేస్తూ “అభినందనలు మలైకా అరోరా” అంటూ ఒక సందేశాన్ని కూడా జత చేశాడు. అయితే ఆ పోస్ట్‌ను కొద్దిసేపటికే తొలగించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.
వైరల్ అవుతున్న ఒక ఫోటోలో సోరబ్ బేడీతో కలిసి మలైకా చాలా క్లోజ్‌గా నిలబడినట్టు కనిపించగా, మరో వీడియోలో ఇద్దరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య కేవలం స్నేహానికి మించిన బంధం ఉందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అభిమానులు “ఇద్దరూ కలిసి చాలా అందంగా కనిపిస్తున్నారు” అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు “ఆమె కూడా మనిషే కదా.. ఆమె జీవితంలో కూడా ప్రేమ ఉండాలి” అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరైతే “వావ్.. ఎంత మంచి జంట” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. గతంలో ఆమె బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్‌ని వివాహం చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ బంధం 2017లో విడాకులతో ముగిసింది. వీరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. తర్వాత 2018లో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో మలైకా ప్రేమలో పడింది. చాలా సంవత్సరాల పాటు కొనసాగిన ఈ రిలేషన్ ఇటీవల ముగిసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై మలైకా గతంలో స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “మనము ఎవరితోనైనా బయటకు వెళ్తే చాలు అది పెద్ద వార్తగా మారుతోంది. పాత స్నేహితుడితో అయినా బయటకు వెళ్లినా వెంటనే కథలు సృష్టిస్తున్నారు. అలాంటి పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను. మేమైతే ఈ వార్తలు చూసి నవ్వుకుంటుంటాం” అని చెప్పింది. ఇప్పటికీ మలైకా అరోరా–సోరబ్ బేడీ మధ్య నిజంగా ప్రేమ ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత లేకపోయినా, వీరి ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram