Naga Chaitanya|టాలీవుడ్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య(Naga Chaitanya) పీకల్లోతు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెద్దలని ఒప్పించి వివాహం చేసుకున్నారు. నిండు నూరేళ్లు ఆ జంట కలిసి ఉంటారని అందరు భావించారు. కాని ఊహించని విధంగా నాగ చైతన్య, సమంత విడిపోయారు.. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.ఇక విడిపోయిన తర్వాత ఇద్దరు కలిసింది లేదు, ఒకరి గురించి ఒకరు మాట్లాడింది లేదు. సమంతనే ఇన్‌డైరెక్ట్‌గా తన విడాకుల గురించి చెప్పింది. అయితే విడాకుల అనౌన్స్‌మెంట్ నుండి ఒంటరిగానే ఉంటూ వస్తుంది సమంత. నాగ చైతన్య మాత్రం శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు.
నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో గురువారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. మరోవైపు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాయి. విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత(Samantha) ఇద్దరూ కలసి ఉన్న ఫోటోలని వారి వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. అయితే నాగ చైతన్య సమంతతో నటించిన మజిలీ చిత్ర పోస్టర్స్ ని అలాగే ఉంచారు. అదే విధంగా నాగ చైతన్య సమంత కలసి ఉన్న ఒక్క ఫోటోని మాత్రం సోషల్ మీడియాలో దాచుకున్నారు.
చైతు తన ఫెరారీ కారులో రేసింగ్ ట్రాక్ పై సమంతతో స్టైలిష్ గా దిగిన ఫోటో అది. ఈ పిక్ లో చైతు, సామ్ ఇద్దరూ వెనుకవైపు నుంచి కనిపిస్తారు. ఈ ఫోటోకి నాగ చైతన్య మిసెస్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్ అనే క్యాప్షన్ అప్పట్లో పెట్టుకున్నాడు. అయితే చైతు, శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత ఫొటోలని పూర్తిగా డిలీట్ చేయాలి అని సామ్ అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దాంతో నాగ చైతన్య తాను దాచుకున్న సమంత చివరి ఫోటోని కూడా డిలీట్ చేశారు. దీనితో ఈ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.ఈ ఏడాది డిసెంబర్ లోనే నాగ చైతన్య, శోభితలు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంగేజ్ మెంట్(Engagement) తర్వాత తమ సినిమా పనుల్లో బిజీ అయిపోయిన ఈ లవ్ బర్డ్స్ జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు.