NC24 : ‘దక్ష’గా మీనాక్షి చౌదరి.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

నాగ చైతన్య ‘NC24’లో మీనాక్షి చౌదరి దక్షగా కనిపించబోతున్నారు. గుహలో అరుదైన రాయిని పరిశీలిస్తున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

NC24

విధాత : అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘NC24’ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ‘దక్ష’పాత్రలో నటిస్తున్న గ్లామర్ తార మీనాక్షి చౌదరి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఓ గుహలో అరుదైన రాయిని ఆమె పరీక్షిస్తూ ఇంట్రెస్టింగ్ లుక్‌లో కనిపించారు. పోస్టర్ చూస్తే మీనాక్షి ఈ మూవీలో ఆర్కియాలజిస్ట్‌గా కనిపించబోతున్నారని అర్ధమవుతుంది. ఇప్పటివరకు గ్లామరస్‌ రోల్స్‌లో ఎక్కువగా కనిపించినా మీనాక్షి చౌదరి ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక హీరో నాగచైతన్య సినిమాలో ట్రెజర్ హంటర్‌గా కనిపించనున్నారు. ‘విరూపాక్ష’ ఫేం కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై నాగ చైతన్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తుండగా, ఇక ‘లాపాటా లేడీస్’ ఫేమ్ నటుడు స్పార్ష్ శ్రీవాస్తవ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.