Ayesha Takia | ప్రముఖ హీరోయిన్ ఆయేషా టాకియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే, ఈ హీరోయిన్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారన్నదానిపై పూర్తి వివరాలు తెలియకపోయినా.. తన లుక్‌పై ట్రోల్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఆయేషా టాకియా దాదాపు 13 సంవత్సరాల పాటు బిగ్ స్క్రీన్‌కు దూరమైంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా మళ్లీ అభిమానులకు దగ్గరైంది. ఫ్యాన్స్ తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెబుతూ వస్తున్నది. తాజాగా ఇటీవల తన లుక్‌కు సంబంధించిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అందులో రంగు చీర ధరించిం కనిపించింది. అయితే, చెంపలు పలచబడి, పెదవులు వాచిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే, ఈ ఫొటోలను చూసిన అభిమానులు షాక్ అయ్యారు.
ఇదేం లుక్.. ఏం జరిగింది? మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. దాంతో ఈ కామెంట్లకు ఇబ్బందిపడిన ఆయేషా టాకియా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసింది. ఆయేషా టాకియా మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా అందంగా కనిపించేందుకు మళ్లీ ముఖానికి సర్జరీ చేయించుకుంది. దాంతో ట్రోల్ రావడంతో ఇబ్బందిపడినట్లు తెలుస్తున్నది. గతంలోనూ ఆమె పలుసార్లు సర్జరీలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఆయేషా తొలిసారి 2004 టార్జాన్ : ది వండర్ కార్ మూవీతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్‌లో నటించింది. చివరగా 2011లో మూడ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తెలుగులో నాగార్జున హీరోగా 2005లో వచ్చిన సూపర్ మూవీలో నటించింది. తొలి సినిమాతోనే అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నది.