Site icon vidhaatha

Naresh-Pavitra| న‌రేష్‌.. ప‌విత్ర లోకేష్‌ని ప్రేమించడం వెన‌క కార‌ణం ఇదా… ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌ప‌డ్డ నిజం..!

Naresh-Pavitra|  సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఇటీవల సినిమాల‌తో క‌న్నా ప‌లు వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. విజయనిర్మల తనయుడిగా న‌రేష్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి హీరోగా మంచి చిత్రాలు చేశారు. ఆయ‌న సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేవి. ఇక కొన్నాళ్ల‌కి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారి కూడా వినోదం పంచుతూనే ఉన్నాడు. అయితే కెరీర్ ప‌రంగా న‌రేష్‌కి ఎలాంటి ఢోకా లేదు కాని ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం చాలా డిస్ట్ర‌బ్డ్ గా ఉంటుంది.న‌రేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా, వారి ముగ్గురితో విడాకులు అయిపోయాయి. ప్ర‌స్తుతం ప‌విత్ర లోకేష్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. వీళిద్ద‌రు సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నార‌ని కూడా టాక్.

 

అయితే నరేష్ వయసు ఇప్పుడు 64 ఏళ్ళు కాగా, పవిత్ర లోకేష్ వయసు 45 ఏళ్ళు. ఈ వయసులో నరేష్ పవిత్ర ప్రేమలో పడడానికి కారణం ఏంట‌నే దానిపై చాలా మందికి క్లారిటీ లేదు. న‌రేష్ ఆస్తి కోస‌మే ఆమె అతనిని ప్రేమించిందా అని కొంద‌రు అనుమానాలు కూడా వ్య‌క్తం చేశారు. ప‌విత్ర లోకేష్ మాజీ భ‌ర్త కూడా ఆస్తి కోస‌మే న‌రేష్‌ని ట్రాప్ చేస్తుంది అని ప‌విత్ర‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. అయితే న‌రేష్‌, ప‌విత్ర మ‌ధ్య ఇంత ఎమోష‌న‌ల్ బాండింగ్ ఏర్ప‌డ‌డానికి గ‌ల కార‌ణాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు న‌రేష్‌. మా అమ్మ విజయ నిర్మల పుట్టిన రోజు.. పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఫిబ్రవరి 20 నే. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపింది అంటూ ఆమెపై ప్రేమ కురిపించాడు.

అత్త కోడ‌ళ్ల పుట్టిన రోజులు ఒకే రోజు రావ‌డం చాలా అరుదు. కాని నా లైఫ్‌లో అది జ‌రిగింది. మా అమ్మ అప్పుడ‌ప్పుడు నాతో చెప్పేది. నీకు అన్నీ ఇవ్వ‌గ‌లిగాను కాని మంచి తోడుని అందించ‌లేక‌పోయాను అని. అప్పుడు మా అమ్మ‌కి ఒక‌టే చెప్పా. నా పార్ట్నర్ గురించి నువ్వు దిగులు పడకు. మంచి వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చింది. ధైర్యంగా ఉండు అని ప‌విత్ర లోకేష్ గురించి గొప్ప‌గా చెప్పాడ‌ట‌. ఆ స‌మ‌యంలో విజ‌య నిర్మల అనారోగ్యంతో బెడ్‌పై ఉన్నార‌ట‌. మొత్తానికి ప‌విత్ర మంచి మ‌న‌సు చూసే న‌రేష్ ఆమెని అంత‌లా ప్రేమించి ఇప్పుడు స‌హ‌జీవ‌నం చేస్తున్నాడ‌ని అర్ధ‌మ‌వుతుంది.

Exit mobile version