విధాత : కన్నడ బ్యూటీ..నేషనల్ క్రష్ రష్మిక మందనా టాలీవుడ్..బాలీవుడ్..మాలీవుడ్..కోలివుడ్ సినీ ఇండస్ట్రీలను ఏలేస్తు హీరోయిన్ల నంబర్ రేసులో దూసుకపోతుంది. ‘యానిమల్’, ‘ఛావా’ వంటి చిత్రాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్న రష్మికా సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’ మూవీ నిరాశ పరిచినా ఇటీవలే నాగార్జున, ధనుష్ కలిసి నటించిన ‘కుబేర’ చిత్రంతో మళ్లీ మరో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీలు ది గర్ల్ ఫ్రెండ్. ఆడవాళ్లు మీకు జోహార్లు, అయుష్మాన్ ఖురానతో కలిసి థామా, తెలుగులో మైసా వంటి చిత్రాలతో పలు భాషా ప్రేక్షకులను అలరించబోతుండటం విశేషం. అలాగే కోక్ టైల్ 2, వీడీ 14, యానిమల్ పార్క్, పుష్ప 3, ఏఏ 22 వంటి 8సినిమాలలో నటించబోతుంది. వరుస సినిమాలతో ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని అభిమానులు మురిసిపోతున్నారు.
జెట్ స్పీడ్ లో రష్మిక మందనా.. 8 సినిమాలతో బిజీ!
