National Film Awards | భగవంత్ కేసరి, హనుమాన్‌కు జాతీయ చలనచిత్ర పురస్కారాలు

 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా మెరిసింది. ‘హనుమాన్’ సినిమాకు యానిమేషన్, యాక్షన్ విభాగాల్లో రెండు అవార్డులు లభించగా, ‘బేబీ’ సినిమాకు స్క్రీన్‌ప్లే, గానం విభాగాల్లో రెండు , ‘బలగం’ పాటకు ఉత్తమ గేయ రచయిత పురస్కారం దక్కాయి. ‘గాంధీతాత చెట్టు’ చిత్రంతో దర్శకుడు సుకుమార్​ కుమార్తె, సుకృతి ఉత్తమ బాలనటిగా జాతీయ గుర్తింపు పొందింది.

భారతదేశంలో సినిమా రంగం అత్యంత గౌరవప్రదంగా భావించే జాతీయ చలనచిత్ర వార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రకటించింది. 71 ఎడిషన్కింద ప్రకటించిన ఈ అవార్డుల్లో సినిమాలు మంచి గుర్తింపు పొందాయి. ముఖ్యంగా బాలకృష్ణ నటించినభగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కాగా, విజువల్ ఎఫెక్ట్స్ మరియు యానిమేషన్ విభాగంలో హనుమాన్ సినిమా రెండు అవార్డులతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇక తెలుగు దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి తన నటనకు గాను గాంధీ తాత చెట్టు చిత్రంతో ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యింది. ఇది తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. బలగం చిత్రంలోని “ఊరు పల్లెటూరు” పాటకు పాటల రచయిత కాసర్ల శ్యామ్కు ఉత్తమ గేయ రచయిత అవార్డు లభించింది. హనుమాన్ చిత్రానికి స్టంట్స్​కు గాను నందు, పృథ్వి అనే యాక్షన్ కొరియోగ్రాఫర్లు అవార్డు గెలుచుకోవడంతోపాటు, ఉత్తమ విజువల్​ ఎఫెక్ట్స్​ అవార్డు కూడా హనుమాన్​కే దక్కింది.  ఉత్తమ స్క్రీన్​ప్లేకు గాను సాయి రాజేశ్ నీలం, ఉత్తమ గాయకుడుగా పీవీఎన్ఎస్ రోహిత్  అవార్డులు బేబీ చిత్రానికి దక్కాయి. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, ఉత్తమ యానిమేషన్ / విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో హనుమాన్​ సత్తా చాటింది.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది – ఈ ఏడాది ఉత్తమ జాతీయ చిత్రంగా విక్రాంత్ మాస్సే నటించిన “12th ఫెయిల్ నిలిచింది. ఈ సినిమా విద్యారంగంలో పోరాడే ఓ యువకుడి గాథను తేటతెల్లం చేసింది. షారుఖ్ ఖాన్ నటించిన “జవాన్” సినిమాలోని పాత్రకు, 12th ఫెయిల్ థానాయకుడు విక్రాంత్ మాస్సే ఉత్తమ టులుగా అవార్డును పంచుకోగా జవాన్​ సినిమాలోని పాట “చెలియా..”కి ఉత్తమ మహిళా గాయనిగా శిల్పా రావు ఎంపికయ్యారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో నటించిన రాణీ ముఖర్జీకి  ఉత్తమ నటి అవార్డు లభించింది.

సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన కేరళ స్టోరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది. మ్యూజిక్ విభాగంలో వాతి సినిమాకు పాటల కోసం జీవీ ప్రకాశ్ కుమార్కు, యానిమల్ సినిమా నేపథ్య సంగీతానికి హర్షవర్ధన్ రామేశ్వర్కు అవార్డులు లభించాయి.

ప్రత్యేక ప్రస్తావనలు:

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు: Best Regional Films

నాన్ ఫీచర్ విభాగంలో విజేతలు: Non-Feature film Winners

ఈ విభాగంలో చిన్న స్థాయిలో అయినా బలమైన సందేశాలను ఇచ్చే డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఈ విభాగంలో “ఫ్లవరింగ్ మ్యాన్” అనే హిందీ చిత్రం ఉత్తమ నాన్-ఫీచర్ ఫిలిం గా ఎంపికైంది. శిల్పిక బోర్డొలాయ్ అనే దర్శకురాలు మావ్: స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ అనే మిజోరాం చిత్రం ద్వారా ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా నిలిచారు.

చెప్పాలంటే, ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో అన్ని భాషల్లోని సినిమాలు, నటులు, సంగీత దర్శకులు, రచయితలు, బాలనటుల ప్రతిభకు న్యాయం జరగడం చూస్తే భారత సినిమా స్థాయి ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలైన భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ, బలగం, గాంధీ తాత చెట్టు వంటి చిత్రాలు ఈ అవార్డుల్లో నిలిచిన విధానం తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అవార్డుల పూర్తి వివరాలు:

ఫీచర్ ఫిల్మ్ విభాగం (Feature Films Category)

 ప్రధాన పురస్కారాలు(Main Awards)

 సహాయ టులు (Supporting Characters)

బాల టులు( Child Artists)

సంగీతం & నేపథ్య గానం:(Music – Playback)

రచన & స్క్రీన్ప్లే:(Story – Screenplay)

సాంకేతిక విభాగాలు(Technical departments)

నృత్యం, యాక్షన్, విజువల్ఎఫెక్ట్స్(Choreography, Action, Visual Effects)

ఇతర పురస్కారాలు:

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు (Best Regional Films)

తెలుగు : భగవంత్ కేసరి
తమిళం : పార్కింగ్
మలయాళం : ఉల్లొళుక్కు
మరాఠీ : ష్యాంచీ ఆయ్
గుజరాతీ : వష్
హిందీ : కథల్
ఒడియా : పుష్కర
బెంగాలీ : డీప్ ఫ్రిడ్జ్
అస్సామీ : రొంగటపు 1982
పంజాబీ : గొడ్డే గొడ్డే చా
కన్నడ : కందీలు – ది రే ఆఫ్ హోప్

 

 నాన్ఫీచర్ ఫిల్మ్స్ విభాగం