Site icon vidhaatha

Nayanthara | హీరోయిన్‌గా నయనతార ఎంట్రీ ఇవ్వకపోతే.. ఏం చేస్తుండేదో తెలుసా..?

Nayanthara | నయనతార పరిచయం అక్కర్లేని పేరు. తనదైన నటనతో కెరియర్‌లో దూసుకుపోతున్నది. మనసునక్కరే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ తర్వాత రజనీకాంత్‌ ‘చంద్రముఖి’ మూవీలో నటించింది. ఈ సినిమాతో తమిళం, తెలుగు ఇండస్ట్రీలకు పరిచయమైంది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ సౌత్‌ లేడి సూపర్ స్టార్‌గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపునే పొందింది. రెండేళ్ల కిందట దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ని పెళ్లి చేసుకున్నది. సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి అయ్యాక సైతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నది. జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నది. ఈ చిత్రం తర్వాత నయనతారకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. జవాన్ అనంతరం కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని ఓపెన్‌ చేసిన నయనతార ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార పాల్గొన్నది. ఈ సందర్భంగా నయన్‌కు హీరోయిన్‌ కాకపోయి ఉంటే ఏం చేస్తూ ఉండేవారని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చి ఉండకపోయి ఉంటే చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయి ఉండేదాన్ని అని తెలిపింది. ప్రస్తుతం నయన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ప్రస్తుతం నయనతార సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నది. మలయాళం, తమిళం, కన్నడ సినిమాలు చేస్తూ వస్తున్నది. తమిళ్‌ మూవీ ‘టెస్ట్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉన్నది. తమిళంలో మన్నంగట్టి సిన్స్‌ 1960, థాని ఒరువన్ 2, ఎన్‌టీ81, మూకుతి అమ్మన్‌-2, గూడ్‌బ్యాడ్‌ అగ్లీతో పాటు విష్ణు ఏడవన్‌ ఫిలిం, సర్జున్‌ కేఎం ఫిలిం మూవీలో నటించనున్నది. మలయాళంలో డియర్‌ స్టూడెంట్‌తో పాటు మమ్మూటి చిత్రంతో పాటు కన్నడలో టాక్సిక్‌ చిత్రాల్లో నటిస్తున్నది.

 

Exit mobile version