This Week’s OTT Releases: ‘కాంతార చాప్టర్ 1’ ఓటీటీలోకి వచ్చేసింది.. ‘లోకా’ కూడా..

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సందడి చేస్తున్నాయి. కాంతార చాప్టర్ 1, లోకా చాప్టర్ 1: చంద్ర, ఇడ్లీ కడై, మారిగల్లు, హెడ్డా వంటి హై-ఎంటర్టైనింగ్ సినిమాలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

This week's OTT releases

This Week’s OTT Releases: From Kantara Chapter 1 to Loka, Must-Watch Weekend Movies

ఈ వారం ఓటీటీల్లో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్లలో బాహుబలి ఎపిక్, రవితేజ మాస్ జాతర సినిమాల హంగామా కొనసాగుతుండగా, ఇంట్లో సినిమా ప్రియుల కోసం ఓటీటీల్లో కూడా బీభత్సమైన లిస్ట్ రెడీగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌, జీ5 వరకు — ప్రతి ప్లాట్‌ఫామ్ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కళకళలాడుతోంది. అన్ని వయసుల వారికి తగ్గ సినిమాలున్నాయి… మరెందుకాలస్యం..? ఎవరికి నచ్చింది వారు చూసేయండి..!

కాంతార: లెజెండ్ చాప్టర్ 1 (Amazon Prime Video)

విడుదల తేదీ: అక్టోబర్ 31
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రీక్వెల్‌ బనగ్రా రాజ్యపు దురాశ, గిరిజన నాయకుడు బెర్మే కథను చూపిస్తుంది. మానవ లోభం, దైవిక ప్రతీకారం కలిసిన పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది. కన్నడలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

లోకా చాప్టర్ 1: చంద్ర (Disney+ Hotstar)

విడుదల తేదీ: అక్టోబర్ 31
మలయాళ సినిమా లోకా చాప్టర్ 1: చంద్ర ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు “కొత్త లోక”గా అందుబాటులోకి వస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతదేశపు తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీగా నిలుస్తుంది. అవయవ అక్రమ రవాణా ముఠాకు ఎదురు తిరిగే మిస్టరీ అమ్మాయి చంద్ర కథ ఆకట్టుకుంటుంది.

ఇడ్లీ కొట్టు (Netflix)

విడుదల తేదీ: అక్టోబర్ 29
ధనుష్, సత్యరాజ్, శాలిని పాండే ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా తండ్రి మరణం తరువాత ఇంటికి తిరిగొచ్చే యువకుడి జీవితాన్ని చూపిస్తుంది. కుటుంబం, ప్రేమ, సంప్రదాయం మధ్య సమతుల్యతను అన్వేషించే హృద్యమైన కథ ఇది.

మారిగల్లు : వెబ్​సిరీస్​ (Zee5)

విడుదల తేదీ: అక్టోబర్ 31
1990ల సిర్సి నేపథ్యంలోని ఈ కన్నడ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్‌లో గ్రామస్తుల బృందం దురాశతో బయటకు వెళ్లి శతాబ్దాల నాటి శాపాన్ని మేల్కొలుపుతుంది. భయానక కథల్ని ఇష్టపడేవారికి ఇది సరైన విందు.

హెడ్డా (Amazon Prime Video)

విడుదల తేదీ: అక్టోబర్ 29
టెస్సా థాంప్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ డ్రామా, ప్రేమలేని వివాహంలో చిక్కుకున్న మహిళ జీవనయాత్రను చూపిస్తుంది. ఆమె మానిప్యులేషన్‌, అంతర్మధనాలు, నాశనకర పరిణామాలు సినిమా సెంటర్‌పాయింట్.

ఇతర ఆకర్షణీయమైన విడుదలలు

వీటితోపాటు మిస్టర్ షుడాయి, టొర్నాడో, సొట్ట సొట్ట నానైయితు, ఉసురే, రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్, ది హోమ్, బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్, స్టిచ్ హెడ్, తలవరా, ఐలీన్, ది అస్సెట్, కుయిలి , ఇట్, మేగన్ 2.0… ఇలా ఈ వారం మొత్తం 47 సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. వీటిలో 27 ప్రత్యేక చిత్రాలు కాగా, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్ రిలీజ్‌లు ఉండటం విశేషం.

వీకెండ్ మస్ట్ వాచ్ లిస్ట్

1️⃣ కాంతార: చాప్టర్ 1 – అద్భుత యాక్షన్ డ్రామా
2️⃣ లోకా చాప్టర్ 1: చంద్ర – భారతీయ సూపర్ హీరోయిన్ కథ
3️⃣ ఇడ్లీ కడై – ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ధనుష్ డ్రామా
4️⃣ మారిగల్లు – హారర్ ప్రేమికులకు సరిగ్గా సరిపడే సస్పెన్స్ థ్రిల్లర్
5️⃣ హెడ్డా – అంతర్మధనాల నాటకీయ ప్రస్థానం