Pallavi Prashanth| రైతు బిడ్డ ముసుగులో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అలా చేస్తున్నాడా.. సైడ్ బిజినెస్ గురించి తెలిసి షాక్

Pallavi Prashanth| ఒక‌ప్పుడు యూట్యూబ‌ర్‌గా ఉన్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు.సామాన్యుడిగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి విన్న‌ర్‌గా క‌ప్ గెలుచుకొని వెళ్లాడు. బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే ఓ సామాన్యుడు ఇలా క‌ప్ కొట్ట‌డం తొలిసారి. అయితే ప్ర‌శాంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఓ రైతు బిడ్డ‌గా వ‌చ్చాడు. ఆయ‌న చివరి వ‌ర‌కు అదే ట్యాగ్‌ని అంటిపెట్టుకొని త‌న ప్ర‌యాణం కొన‌

  • Publish Date - May 22, 2024 / 07:47 PM IST

Pallavi Prashanth| ఒక‌ప్పుడు యూట్యూబ‌ర్‌గా ఉన్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు.సామాన్యుడిగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి విన్న‌ర్‌గా క‌ప్ గెలుచుకొని వెళ్లాడు. బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే ఓ సామాన్యుడు ఇలా క‌ప్ కొట్ట‌డం తొలిసారి. అయితే ప్ర‌శాంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఓ రైతు బిడ్డ‌గా వ‌చ్చాడు. ఆయ‌న చివరి వ‌ర‌కు అదే ట్యాగ్‌ని అంటిపెట్టుకొని త‌న ప్ర‌యాణం కొన‌సాగించాడు. అయితే ప్ర‌శాంత్ బిగ్ బాస్ విన్న‌ర్ కావ‌డంతో చాల మంది సంతోషించారు. కాని ట్రోఫీ అందుకున్న త‌ర్వ‌త అన్నపూర్ణ స్టూడియో ఎదుట మ‌నోడు చేసిన ర‌చ్చకి ఆయ‌న‌పై బాగా నెగెటివిటీ ఏర్ప‌డింది.

పోలీసులు వ‌ద్ద‌న్నా కూడా త‌న అభిమానుల‌తో క‌లిసి ర్యాలీ చేశాడు. ప్ర‌శాంత్ ఫ్యాన్స్ అల్ల‌ర్లకు పాల్ప‌డ్డారు.ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తో పాటు అత్తని తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌శాంత్ య‌ధావిధిగా త‌న యూట్యూబ్ ఛానెల్ ర‌న్ చేస్తూ ప‌లు వీడియోల‌తో అల‌రిస్తున్నాడు. మ‌రోవైపు స్టార్ మా ఈవెంట్స్‌, ఫ్రెండ్స్ గెట్ టూ గెద‌ర్ పార్టీల‌కి వెళుతూ అక్క‌డ సంద‌డి చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ప్ర‌శాంత్ త‌ను ఇచ్చిన మాట ఇప్ప‌టి వ‌ర‌కు నిల‌బెట్టుకోలేదు. టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ పేద రైతులకు పంచేస్తానని పల్లవి ప్రశాంత్ మాట ఇచ్చాడు. కాని షో ముగిసి ఐదు నెలలు అవుతున్నా ముందడుగు వేయ‌లేదు. ల‌క్ష రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి పెద్ద హంగామా చేశాడు.

ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యాడు. దీంతో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. మిగ‌తా డ‌బ్బులు ఎక్క‌డ ఖ‌ర్చు పెడుతున్నావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. మ‌రోవైపు పల్లవి ప్రశాంత్ తన ఫేమ్ ని బాగానే వాడుకుంటున్నాడని, . షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి వెళితే త‌క్కువ‌లో త‌క్కువ రెండు ల‌క్ష‌ల నుండి ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. ఏ ర‌కంగా చూసిన నెలకు పల్లవి ప్రశాంత్ సంపాదన రూ. 20 లక్షల పైనే ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా అతనికి డబ్బులు వ‌స్తాయి.ఇచ్చిన మాట ప్ర‌కారం మ‌రి కొంత రైతులకి సాయం చేస్తే బాగుంటుంద‌ని కొందరు అంటున్నారు.

Latest News