Site icon vidhaatha

Allu vs Mega|మెగా- అల్లు వివాదం ..మొన్న నాగ‌బాబు, నిన్న తేజూ , నేడు ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

Allu vs Mega| ఒక‌ప్పుడు మెగా అల్లు ఫ్యామిలీ ఒక కుటుంబం మాదిరిగా ఉండేది. కాని ఎప్పుడైతే అల్లు అర్జున్‌కి స్టార్ డం వ‌చ్చిందే మనోడు మెగా ట్యాగ్‌ని వ‌దిలించుకునే ప్ర‌యత్నం చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ ఓ ఈవెంట్‌లో చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ ఎప్పుడైతే కామెంట్ చేశాడో అప్ప‌టి నుండి మెగా వ‌ర్సెస్ అల్లు ఇష్యూ మొద‌లైంది. మ‌ధ్యలో ఈ రెండు కుటుంబాల వివాదాల గురించి అనేక పుకార్లు బ‌య‌ట‌కు రాగా, వాటిని ఖండించారు అల్లు అర‌వింద్. అయితే ఏపీ ఎన్నికల వేళ నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డి ఇంటికి నేరుగా వెళ్లి త‌న‌ మద్దతు తెలిపాడు అల్లు అర్జున్. దీనిపై మెగా అభిమానులతో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు సోషల్ మీడియాలో ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే అంటూ పరుష పదజాలంతో విరుచుకుప‌డ‌డంతో అది అల్లు అర్జున్‌ని ఉద్దేశించే అన్నాడని అంద‌రు అనుకున్నారు. ఇక కొద్ది రోజుల త‌ర్వాత అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేశాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. దీంతో అల్లు అర్జున్ అంటే మెగా హీరోలు, కుటుంబ సభ్యులకి న‌చ్చ‌డం లేద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇక నిహారికకి క‌మిటీ కుర్రోళ్లు ప్ర‌మోష‌న్స్‌లో అల్లు అర్జున్ వివాదం గురించి ప్ర‌శ్న‌లు ఎదురు కాగా, వాటికి పెద్ద‌గా రెస్పాండ్ కాలేదు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు చేశాడు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటిస్తే ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు అని అన్నాడు.

పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా అన్నారని, ఉద్దేశ్య పూర్వకంగానే బన్నీ మీద, పుష్ప చిత్రం మీద కౌంటర్లు వేశారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ‌రం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు, వేసిన సెటైర్లతో మెగా వర్సెస్ అల్లు ఇష్యూ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.చూస్తుంటే ఈ వివాదం మ‌రింత ముదిరేలా క‌నిపిస్తుంది. అయితే ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మ‌నోహ‌ర్ ప‌వ‌న్ చేసిన కామెంట్స్ అల్లు అర్జున్‌ని ఉద్దేశించి కాద‌ని అన్నారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేది పవన్ కల్యాణ్ ఆలోచన అని , పవన్ చేసిన కామెంట్స్ కేవలం అడవుల నరికీవేతపై మాత్రమేనని, అల్లు అర్జున్ నో, మరొకరినో ఉద్దేశించి కాదని చెప్పుకొచ్చారు.

Exit mobile version