Sasa Sasa Video Song : ప్రభుదేవా వూల్ఫ్ నుంచి సాసా పాట..హీట్ పెంచేశారు

ప్రభుదేవా వూల్ఫ్‌ సినిమాలో సాసా పాట విడుదల. అనసూయ, రాయ్ లక్ష్మీ వయ్యారాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

Wolf movie sasa sasa song released

విధాత: ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వూల్ఫ్‌. ఈ సినిమా నుంచి తాజాగా సాసా అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రభుదేవా ఇంటికి వచ్చిన రాయ్ లక్ష్మీ, అనసూయ, అంజుకురియన్ లు అతనితో ముగ్గురు కూడా ఒకే రోమాన్స్ కు సిద్దమవుతున్న సన్నివేశాలతో సాసా పాట ప్రేక్షకుల్లో హీట్ పుట్టిస్తుంది. ముగ్గురు నటీమణులు కూడా ఈ పాటలో తమ వయ్యారాలతో మత్తెక్కించారు.

వినూ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది 2023ఆగస్టులో టీజర్ విడుదల చేసిన ఈ సినిమా నుంచి 2025నవంబర్ లో ఓ పాట విడుదల చేయడం గమనార్హం.

వూల్ఫ్‌ సినిమాలో అనసూయ ఓ తాంత్రికురాలిగా కనిపిస్తారని..ఆమె పాత్ర హర్రర్, రోమాంటిక్ మూడ్ లో సాగుతుందని తెలుస్తుంది. మూవీలో వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు కీలక పాత్రల్లో నటించారు. అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.