Prasads Multiplex | ప్రసాద్ మల్టీప్లెక్స్(Prasads Multiplex ).. ఈ పేరు తెలియని సినీ లవర్స్( Cine Lovers ) ఉండరు. ఎందుకంటే రిలీజయ్యే ప్రతి మూవీని వీక్షించేందుకు సినీ అభిమానులు ఈ మల్టీప్లెక్స్‌కు తరలివస్తుంటారు. అలా హుస్సేన్ సాగర్( Hussain Sagar ) తీరాన సరదాగా గడిపి.. పక్కనే ఉన్న ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మూవీ చూస్తే.. అది ఓ మధురానుభూతిగా మిగిలిపోతోంది.
ఇప్పుడు మరో మధురానుభూతిని ప్రసాద్ మల్టీప్లెక్స్ అందిస్తుంది. కొత్తగా సినీ లవర్స్‌కు స్క్రీన్ 5( Screen 5 )ని పరిచయం చేస్తుంది. ప్రసాద్ మల్టీప్లెక్స్. 224 సీట్ల సామర్థ్యంతో స్క్రీన్ 5 సిద్ధమైంది. సాంకేతికతను ఉపయోగించుకుని సరికొత్తగా, ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక వాల్స్, స్టెప్స్‌ను పర్పుల్ లైటింగ్‌లో వెలిగిపోతోంది. మనసుకు ఎంతో హాయిని ఇచ్చేలా ఎంతో ఆకర్షణీయంగా, రమణీయంగా తీర్చిదిద్దారు. స్క్రీన్ 5లో సినిమా చూస్తే.. గొప్ప ఫీలింగ్‌ను మాత్రం పొందొచ్చు. సినీ ప్రియులకు ఇది ఒక మధురానుభూతిగా మిగిలిపోవడం ఖాయమని చెప్పొచ్చు.
సౌండ్ సిస్టమ్ కూడా అద్భుతమే. మోడ్రన్ లుక్‌లో స్క్రీన్ 5ని తీర్చిదిద్దడంతో సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. Say hello to Screen 5 పేరిట ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.