Site icon vidhaatha

Pushpa2:కాలు తో చీర కొంగును తీసుకునే షాట్ కోసం నానా తిప్ప‌లు ప‌డ్డ బ‌న్నీ.. ఫైన‌ల్‌గా ఎలా ఓకే అయిందంటే..!

Pushpa2: ప్ర‌స్తుతం టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది. మ‌న సినిమాలు గ్లోబ‌ల్ స్థాయి రీచ్ అందుకునేలా మేక‌ర్స్ చాలా అందంగా చిత్రీక‌రిస్తున్నారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత తెలుగు సినిమాల మేకింగ్‌లో చాలా మార్పు వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కు రాజ‌మౌళినే అనుకుంటేనే ఆయ‌న‌తో పోటి ప‌డుతూ అద్భుత‌మైన సినిమాలు తీస్తున్నారు. అభిమానుల కోసం మన స్టార్ హీరోలు కూడా చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలు ఎంతో పెద్ద హిట్ కావ‌డమే కాక ఇంటర్నేష‌న‌ల్ స్థాయిలోను మంచి గుర్తింపు ద‌క్కించుకున్నాయి. అయితే అల్లు అర్జున్ న‌టించిన పుష్ప చిత్రం ఓ రేంజ్ స‌క్సెస్ అందుకోవ‌డ‌మే కాకుండా ఈ మూవీకి ప‌లు నేష‌న‌ల్ అవార్డ్స్ కూడా ద‌క్కాయి.

ఇప్పుడు పుష్ప చిత్రంకి సీక్వెల్‌గా పుష్ప‌2 చిత్రం చేస్తున్నాడు బ‌న్నీ. ఆగస్టు 15వ తేదీన మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ రికార్డులు చెరిపేస్తుంది. టీజ‌ర్‌లో బ‌న్నీ గెట‌ప్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోయారు. అయితే ఈ టీజ‌ర్‌లో మ‌నం ఒక‌టి గ‌మ‌నించిన‌ట్టైతే.. అల్లు అర్జున్ గంగాలమ్మ తల్లి గెటప్ లో ఒకడి బాడీ మీది నుంచి తన కాలును తీసుకొని ఆ కాలుతోనే తన చీర కొంగును పైకి విసురుతాడు. అప్పుడు దానిని తీసుకొని బొడ్లో దోపుకుంటాడు. ఇదంతా కూడా ఒకే షాట్‌గా చిత్రీక‌రించాడ‌ట సుకుమార్. అయితే ఇంత హెవీ సీన్ కోసం టీం అంతా చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

కాలితో చీర కొంగుని పైకి విసరడం అనేది ఒకేత్తు అయితే, దానిని పట్టుకునే సమయంలో బ‌న్నీ బాడీ చాలా స్టిఫ్‌గా ఉండాలి. కొంచెం బెండ్ అయిన కూడా ఆ ఇంపాక్ట్ పోతుంది. అందుకే ఆ షాట్ కోసం అల్లు అర్జున్ చాలా హార్డ్ వ‌ర్క్ చేశార‌ట‌. సుకుమార్ ఈ షాట్ కోసం 15 టేకులలో పూర్తి చేశాడ‌ట. ఇక బ‌న్నీ అయితే త‌న కాలుతో చీర కొంగుని పైకి విసిరేసి దానిని చేతితో ప‌ట్టుకునేందుకు వంద సార్లు ప్రాక్టీస్ చేశాడ‌ట‌.అప్పుడు త‌న‌కి క్లారిటీ రావ‌డంతో ఆ షాట్ ని కేవలం సింగల్ టేక్ లో పూర్తి చేశాడట బ‌న్నీ.. అప్పటికే సుకుమార్ సింగల్ షాట్ లో ఇదంతా రాదేమో అనుకొని దానిని డిఫ‌రెంట్ షాట్స్‌లో చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాడ‌ట‌. కాని బ‌న్నీ మాత్రం ఈజీగా ఆ షాట్‌ని పూర్తి చేసి ద‌టీజ్ ఐకాన్ స్టార్ అని నిరూపించుకున్నాడు

Exit mobile version