Rahul sipligunj| ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచిన చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇందులోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. ఈ పాటకి ఆస్కార్ వేదికపై లైఫ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. దీంతో అతని పేరు దేశ వ్యాప్తంగా కూడా మారుమ్రోగిపోతుంది. కెరీర్ మొదట్లో ప్రైవేట్ సాంగ్స్ అల్బమ్స్ చేస్తూ అదరగొట్టిన రాహుల్ ఆ తర్వాత కాలంలో సినిమాలలో అవకాశాలు దక్కించుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు రాహుల్ సిప్లిగంజ్ ఎన్నో మంచి హిట్స్ ఆలపించారు.
ఇక బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని తన ఆట, పాటలతో సందడి చేశాడు. పునర్నవితో పులిహోర కలుపుతూ నానా రచ్చ చేశాడు. ఏదైతేనేం బిగ్ బాస్ షో విన్నర్‌గా నిలిచి సత్తా చాటాడు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ఓ రీల్ షేర్ చేశాడు. ఇందులో ఓ అమ్మాయిని పరిచయం చేస్తూ.. తనకి విషెస్ తెలియజేశాడు. ఇక ఈ వీడియోని చూసిన వారంతా కూడా ఎవరు ఈ అమ్మాయి, కొత్త గార్ల్ ఫ్రెండా అంటూ ఆరాలు తీస్తున్నారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్ పలువురితో ప్రేమాయణం నడిపినట్టు నెట్టింట తెగ ప్రచారాలు సాగాయి. కాని ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.
ఇప్పుడు రాహుల్ చేసిన రీల్ లో కనిపిస్తున్న అమ్మాయి పేరు హరిణ్య రెడ్డి.. వీరిద్దరూ ఇప్పుడు ఫారిన్ ట్రిప్ లో ఉన్నట్లు తెలుస్తుండగా, ఆమెతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేయడంతో పలువురు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. హరిణ్య రెడ్డికి రాహుల్ సిప్లిగంజ్ తో పాటు, అరియానా,అషురెడ్డి, యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ స్రవంతి, సొహైల్, వైవా హర్ష, సింగర్ కృష్ణ చైతన్య, గీతా మాధురి వంటి వారు ఫాలోవర్స్‌గా ఉన్నారు. అంటే ఈ అమ్మడికి ఇండస్ట్రీ వాళ్లతో బాగానే పరిచయాలు ఉన్నట్టు అర్ధమవుతుంది. కాగా, రాహుల్ బిగ్ బాస్ సీజన్ 7వ లో పాల్గొన్న రతికాతో ప్రేమలో ఉన్నాడని గతంలో బాగా ప్రచారం జరిగింది. అషూ రెడ్డితో కూడా కొన్నాళ్లు కలిసి తిరిగడం మనం చూశాం.