Raj Tarun| యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం టాలీవుడ్‌లో ఎంత చర్చనీయాంశంగా మారిందో మనం చూస్తున్నాం.గత కొద్ది రోజులుగా లావణ్య.. రాజ్ తరుణ్‌పై ఫైట్ చేస్తూనే ఉంది.11 ఏళ్లుగా ప్రేమించుకున్న మేము ఇద్దరం గుడిలో వివాహం కూడా చేసుకున్నామని తెలిపింది. ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ మధ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రావడంతోనే గొడవలు మొదలయ్యాయని చెప్పుకొచ్చింది. మరోవైపు మాల్వీ కోసం తనని డ్రగ్స కేసులో కూడా ఇరికించాడని పేర్కొంది. ఇక మాల్వీ, ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ప్రూఫ్స్‌తో సహ సమర్పించింది లావణ్య.
రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారంకి సంబంధించి ప్రతి రోజు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా రాజ్ తరుణ్-మాల్వీల చాట్ లీక్ కావడంతో వీరి వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.చాట్ లీక్ ప్రకారం 2023లో మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ప్రపోజల్ మాల్వీ వెంటనే యాక్సెప్ట్ చేసి అప్పటి నుండి అతనితో రిలేషన్‌లో ఉందని అర్ధమవుతుంది. మాల్వి అనేక సార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేసింది. ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో రాజ్ తరుణ్, మాల్వి కలిసేవారని, వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారని చాటింగ్ ద్వారా అర్ధమవుతుంది.
ఇక రోజువారీ ప్లానింగ్స్, ట్రిప్స్, ఔట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారని చాటింగ్ ద్వారా తెలుస్తుంది. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన రాజ్ తరుణ్ ఈ లీక్ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా, లావణ్య ఇప్పటి వరకు సాక్ష్యాలు పోలీస్ స్టేషన్‌లో అందజేయడంతో పోలీసులు రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌కి నోటీసులు కూడా పంపించారు. రోజు రోజుకి ఈ కేసులో పలు ట్విస్ట్‌లు చేసుకుంటుండడంతో ఈ కేసుపై అందరు దృష్టి పెడుతున్నారు.