Site icon vidhaatha

Ram Charan| అత్యంత ఖ‌రీదైన కారులో ప్ర‌త్య‌క్షం అయిన రామ్ చ‌ర‌ణ్‌.. దేశంలోనే ఇది రెండోది..!

Ram Charan| మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇంకో 20 రోజులు షూటింగ్‌ చేస్తే ఆ సినిమా పూర్తవుతుందని ఇటీవల శంకర్ తెలియ‌జేశారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అడ్వాణీ కథానాయిక కాగా దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ పూర్తైన త‌ర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కథానాయికగాగా నటిస్తోంది. ఆగస్ట్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

అయితే రామ్ చ‌ర‌ణ్ తాజాగా అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహానికి ముంబై బ‌య‌లు దేరి వెళ్లారు. అయితే త‌న ఇంటి నుండి ఎయిర్‌పోర్ట్‌కి రావ‌డానికి రామ్ చ‌ర‌ణ్ కొత్త రోల్స్‌ రాయిస్‌ స్పెక్టార్‌ను డ్రైవ్‌ (Rolls-Royce Spectre)చేసుకుంటూ వచ్చారు. దాదాపు రూ.9 కోట్లకు పైగా ఖరీదైన కారు అని తెలుస్తుంది. భారతదేశంలో ఉన్న రెండో కారు అని అందరు చెప్పుకొస్తున్నారు. కారుపై తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ బోర్డ్ ఉంది. హైదరాబాద్ లో ఈ వెర్షన్ ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ నేనని ఓ టాక్ నడుస్తుంది. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఖ‌రీదైన కార్లు ఉండ‌గా, ఇప్పుడు గ్యారేజ్‌లో మ‌రో కారు చేరింది.

రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, మెర్సిడెస్ మే బ్యాక్ GLS 600, మెర్సిడేజ్ బెంజ్ GLE 450 AMG కూపే, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫెరారీ పోర్టోఫినో, ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 వెహికల్స్ చరణ్ దగ్గర ఉన్నాయి. అయితే కొత్త కారుని రామ్ చ‌ర‌ణ్ గతంలో ఎప్పుడో బుక్ చేసినా ఇటీవలే ఈ కార్ డెలివరీ అయింది. హైదరాబాద్ లో ఈ కార్ ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం గమనార్హం.ఇక ఈ కారులోనే రామ్ చ‌ర‌ణ్ ర‌య్యిమంటూ అన్ని ప్రాంతాల‌కి వెళ‌తాడ‌ని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Exit mobile version