Ramoji Rao | బిగ్ బ్రేకింగ్.. రామోజీగ్రూపు సంస్థ‌ల అధినేత‌ రామోజీ రావు క‌న్నుమూత‌..

Ramoji Rao| ఈనాడు సంస్థల అధినేత, రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ రావు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే ఆయనను హైదరాబాద్ శివారులో ఉన్న రామో

  • Publish Date - June 8, 2024 / 06:50 AM IST

Ramoji Rao| ఈనాడు సంస్థల అధినేత, రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ రావు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే ఆయనను హైదరాబాద్ శివారులో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ రావు నివాసం నుంచి.. నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయ‌న‌కి వెంటిలేట‌ర్‌పై చికిత్స అందించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో  ఈ తెల్లవారుఝామున 4.50ని.లకి  క‌న్నుమూసారు. ఆయ‌న పార్ధివ దేహాన్ని ఫిలింసిటీలోని నివాసానికి త‌ర‌లించ‌నున్నారు. రామోజీరావు క‌న్నుమూసార‌న్న వార్తతో ప్ర‌తి ఒక్క‌రు దిగ్భ్రాంతి చెందుతున్నారు.ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు.

తెలుగు నాట మీడియాకు విశేష ప్రాచుర్యం ఎపుడూ ఉంది. దాన్ని పీక్స్ కి తీసుకెళ్ళిన వ్యక్తిగా శక్తిగా ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు. మీడియా మొఘల్ గా ఘనమైన కీర్తి సంపాదించుకున్నారు. దాదాపుగా నాలుగు దశాబ్దాల కాలంగా తెలుగు నాట రాజకీయాలను ఆయన ప్రభావితం చేస్తున్నారు అని చెప్పుకోవ‌చ్చు. రామోజీరావు 1936లో నవంబర్ 16న క్రిష్ణా జిల్లా పెదపారపూడిలో జన్మించారు. ఆయన ఇంతటి ఎత్తుకు ఎదగడం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారు అని చెబుతారు.

పత్రికా రంగంలో రామోజీ రావుకు దీటుగా నిలబడేవారు లేకుండా పోయారు. ఈనాడు దినపత్రికను చిన్నగా ప్రారంభించి, క్రమంగా విస్తరించారు రామోజీ రావు. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి రామోజీ రావు ఎదిగారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఎన్టీ రామారావు అధికారంలోకి రావడంలో రామోజీ రావు ఈనాడు దినపత్రికనే ప్రధాన భూమిక పోషించిందన్న విష‌యాన్ని ఎవ‌రు కొట్టిపారేయ‌లేరు. ఈనాడును ఆయన కాలానుగుణంగా మార్పుకుంటూ ఈ ప‌త్రిక‌కి మరొకరు సాటి రారు అన్నట్లుగా తీర్చి దిద్దారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ పత్రికా రచనారంగంలో దానికి సాటి వచ్చే పత్రిక లేదని అందరూ అంగీకరిస్తారు.

పత్రికారంగంలో రామోజీరావు చేసిన సేవకు గాను ఆయన కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది. ఈటీవీని కూడా ఆయన బహుముఖంగా విస్తరించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌ను, ప్రియా ఫుడ్స్‌ను, కళాంజలిని స్థాపించారు. పత్రికా రంగంతో ప్రారంభమైన ఆయన వ్యాపారం క్రమంగా వివిధ రంగాలకు విస్తరించింది. హైదరాబాదు శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఈనాడు గ్రూపు కింద ఈనాడు దినపత్రిక, టీవీలతో పాటు ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలీ షోరూమ్స్ ఉన్నాయి. వసుంధర పబ్లికేషన్స్ తరఫున రామోజీ రావు సితార (సినిమా పత్రిక), చతుర (నవలా ప్రచురణకు సంబంధించిన మాస పత్రిక), విపుల (కథలకు సంబంధించిన మాస పత్రిక, వివిధ భాషలకు సంబంధించిన కథలకు తెలుగు అనువాదాలు అందిస్తుంది), అన్నదాత (రైతు పత్రిక), తెలుగు వెలుగు వంటివాటిని ప్రచురిస్తున్నారు.

ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కింద శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, మూడు ముక్కలాట, చిత్రం, వంటి పలు చిత్రాలను నిర్మించారు రామోజీరావు. బహుముఖంగా ఆయన వ్యాపార కార్యకలాపాలు విస్త‌రిస్తూ అన్నింటా విజ‌యం సాధించారు. ఈనాడు దినపత్రికకు దీటుగా దాసరి నారాయణ రావు ఉదయం దినపత్రికను, గిరీష్ సంఘీ వార్త పత్రికను ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Latest News