విధాత : తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి(97) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసు నుంచే పాడడం ప్రారంభించిన బాల సరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో మొత్తం 2000కి పైగా పాటలు పాడారు. లలిత సంగీత దిగ్గజంగా పేరుందిన బాల సరస్వతి దేవి 1939లో మహానంద సినిమాతో తెలుగులో తొలి నేపధ్య గాయనిగా గుర్తింపు పొండారు.
ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాటను ఆలపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి దశలో అనేక మధుర గీతాలు ఆలపించారు. 1930 నుంచి 1960 వరకు తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడటంతో పాటు పలు చిత్రాల్లో బాల సరస్వతి నటించారు.