విధాత : రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ Andhra King Talukaనుంచి మేకర్స్ ఆదివారం టీజర్ విడుదల చేశారు. మూవీలో కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. హీరో రామ్ ఈ సినిమాలో ఆంధ్రాకింగ్ ఉపేంద్ర వీరాభిమానిగా నటించారు. టీజర్ లో టీజర్‌లో రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. గోదావరి అందాల నడుమ హీరో హీరోయిన్లు ప్రేమకథని మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశారు.
సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. నవంబరు 28న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా కోసం హీరో రామ్ ఓ పాటను రాయడంతో పాటు పాడటం విశేషం.