విధాత : భాగ్యశ్రీ బోర్సే సినిమాల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. తెలుగు సినిమాల్లోకి వచ్చి కూడా ఏడాది దాటిపోయింది. చేసిన నాలుగు సినిమాల్లో రెండు మాత్రమే విడుదలయ్యాయి. తొలుతగా విడుదలైన సినిమా మిస్టర్ బచ్చన్, ఆ తర్వాత వచ్చిన కింగ్ డమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ధ నిలబడలేదు. ఆమె తొలుత నటించిన సినిమా కాంత ఆలస్యంగా ఈ నెల 14న విడుదలవుతుంది. అయితేనేమీ.. అందాల తార భాగ్యశ్రీ బోర్సే కు ప్రేక్షకుల్లో..ముఖ్యంగా కుర్రకారులో ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. ప్రస్తుతం రామ్ పోతినేని సరసన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో భాగ్య శ్రీ బోర్సే నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలలో ఆమె గ్లామర్, డాన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆంధ్రా కింగ్ తాలుకా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమా కోసం హీరో రామ్ పోతినేని స్వయంగా రాసిన పాట..నువ్వుంటే చాలే..ఒక చూపుతో నాలోనే పుట్టిందే..ఏదో వింతగా గుండెలో చేరిందే పాటను పాడేసింది. దీంతో దెబ్బకు ప్రేక్షకులు వామ్మో సింగర్లకు తీసిపోని రీతిలో పాడేసిందే అనుకుంటూ అశ్చర్యం వ్యక్తం చేశారు. అందాల బొమ్మ భాగ్యశ్రీ బోర్సేలో సింగర్ టాలెంట్ కూడా ఉందా అనుకుంటూ అభినందిస్తున్నారు. భాగ్యశ్రీ పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ఇంటర్వ్యూలో యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖీ మీ ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ కొనసాగుతుందంటూ అడగడం..దానికి ఇద్దరూ నేరుగా ఖండించకుండా ముసిముసి నవ్వులతో దాటవేయడం చర్చనీయాంశమైంది. ఆంధ్రాకింగ్ సినిమా నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది.
భాగ్యశ్రీ బోర్సేను ముందుగా మేం పట్టాం : రానా
ఈ నెల 14న విడుదల కానున్న ‘కాంత’ సినిమా ప్రమోషన్ లో నటుడు, నిర్మాత దగ్గుబాటి రాణా భాగ్యశ్రీ భోర్సే గురించి హైప్ ఇవ్వడం కూడా వైరల్ గా మారింది. కాంత సినిమాకి హీరోయిన్ కోసం 100 మందికిపైగా నటీమణుల్ని ఆడిషన్ చేయగా..అందులో భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాకు ఎంపికైందని.. ఈ సినిమాతోనే ఆమె తెలుగు సినిమాకు పరిచయం కావాల్సి ఉన్నా వివిధ కారణాల సినిమా ఆలస్యమైందని రానా చెప్పుకొచ్చాడు. మేడమ్ భాగ్యశ్రీ బోర్సేను ముందుగా మేమే పట్టినా.. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్ లతో మా సినిమా కంటే ముందే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందని గుర్తు చేశాడు.
The chartbuster #NuvvunteChaley in #BhagyashriBorse‘s voice is adorable ❤️
The Unfiltered Talk by @MukhiSree with Energetic Star @ramsayz & #BhagyashriBorse out tomorrow❤🔥
Promo ▶️ https://t.co/ZOtQanzPNR#AndhraKingTaluka GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 28th.… pic.twitter.com/LPKhiqcPub
— Mythri Movie Makers (@MythriOfficial) November 7, 2025
