Site icon vidhaatha

Rashmi|అన‌సూయ ఏమ‌న్నా చిన్న పిల్ల‌నా.. ఆమెతో వివాదంపై నోరు విప్పిన ర‌ష్మి

Rashmi| బుల్లితెర కామెడీ షోతో మంచి పేరు ప్రఖ్యాత‌లు అందుకున్నారు అన‌సూయ‌, ర‌ష్మీ గౌతమ్. మొద‌ట్లో అన‌సూయ ఈ షోని హోస్ట్ చేయ‌గా, ఆ తర్వాత ర‌ష్మీ వ‌చ్చింది. ఇద్ద‌రు క‌లిసి కొన్నాళ్లు షోని అద్భుతంగా న‌డిపించారు. ఇక అన‌సూయ వెళ్లిపోయిన త‌ర్వాత ర‌ష్మీ జ‌బ‌ర్ధ‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌ల‌ని హోస్ట్ చేసింది.ఇక ఆ త‌ర్వాత వేరే యాంక‌ర్స్ వ‌చ్చి జ‌బ‌ర్ధ‌స్త్‌ని హోస్ట్ చేస్తుండ‌గా, ర‌ష్మీ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ ర‌న్ చేస్తుంది. అయితే ర‌ష్మీ ఒక‌ప్పుడు న‌టిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ యాంక‌ర్‌గా మారింది. ఆమె మ‌ల్లెమాల‌కి సంబంధిచిన ప్ర‌తి ఈవెంట్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. అయితే ర‌ష్మీ ఏప్రిల్ 27న 36వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమెకి సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

అప్ప‌ట్లో జ‌బ‌ర్ధ‌స్త్‌, ఎక్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ రెండింటికి అనసూయ‌నే యాంక‌ర్‌గా ఉండేది. అయితే రష్మీ రావడంతో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షో అవకాశం ఆమెకి దక్కింది. కొన్ని రోజుల త‌ర్వాత అనసూయ పక్కకి తప్పుకుందో.. లేక తప్పించారో తెలియదు కానీ ర‌ష్మీనే రెండింటిని హోస్ట్ చేసింది. దీనిపై రష్మీని ట్రోల్ చేస్తూ దారుణంగా విరుచుకుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో రష్మీ దీని గురించి బోల్డ్ గా స్పందించింది. నాకు సంబంధం లేని విషయంలో నన్ను ట్రోల్ చేయ‌డం బాధ‌గా ఉంటుంది. అస‌లు నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాబ‌ట్టి ఉండిపోయా. 13 ఎపిసోడ్స్ కే జబర్దస్త్ కి ఇంత క్రేజ్ ఏంటి అని ఆలోచిస్తుంటే కొంద‌రు నన్ను దారుణంగా తిట్టారు అని రష్మీ వాపోయింది.

రష్మీ నువ్వు అనసూయ ప్లేస్ ని ఎందుకు ఆక్రమించావు అని ఆ యాంకర్ అడిగితే దానికి స‌మాధానం ఇచ్చిన ర‌ష్మీ.. నేను ఆక్రమించుకోవడం ఏంటి.. లాగేసుకున్నా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చింది. అనసూయని పక్కకి పంపి ఆ స్థానంలోకి నువ్వు ఎందుకు వ‌చ్చావు అని అడిగా.. అనసూయ చిన్న పిల్లా ఏంటి పక్కకి పంపడానికి అంటూ రష్మీ త‌ద‌నైన స్టైల్‌లో జ‌వాబు ఇచ్చింది. అప్పుడు ర‌ష్మీ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియోని ఇప్పుడు తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఇక ర‌ష్మీ ఇప్పుడు షోస్‌తో పాటు సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటుంది. ఇక సామాజిక సేవ విష‌యంలోను ముందు ఉంటుంది.

Exit mobile version