Rashmika| కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందాన టాలీవుడ్‌లో సత్తా చూపుతున్న విషయం తెలిసిందే. మంచి విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పుష్ప2తో పలకరించనుంది. ఈ సినిమాలో రష్మిక తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టబోతుంది. అయితే రష్మిక మందన్న కొన్ని రోజుల క్రితం డీప్ ఫేక్ బారిన పడడం మనం చూశాం. ప్రముఖ కొలంబియా మోడల్ డానియోలా విల్లారియల్ ఇన్‌స్టా రీల్‌ను ఎడిట్ చేసి ఈ వీడియోను రూపొందించారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ఎక్కువగా డీప్ ఫేక్ బారిన పడుతున్నారు. మొదటిసారి హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో బయటికి వచ్చిన తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇక నిందితుడికి కఠిన విధించిన తర్వాత కూడా డీప్ ఫేక్ వీడియోల గోల కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ మధ్య హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆలియా భట్, కాజోల్, ప్రియాంక చోప్రా, నోరా ఫతేహిలతో పాటు సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు కూడా డీప్ ఫేక్ బారినపడ్డారు. రష్మికని మళ్లీ మోడల్ డానియోలా మాదిరిగా ఎడిట్ చేసివీడియోను రూపొందించారు. మొదటిసారి వచ్చిన రష్మిక డీప్ ఫేక్ వీడియో కంటే ఆ వీడియో మరింత అసభ్యకరంగా ఉంది. ఇక తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో మరొకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలో ఎవరో బ్లాక్ బికినీ ధరించిన అమ్మాయికి రష్మిక ఫేస్ ను యాడ్ చేశారు.
రష్మిక డీప్ ఫేక్ వీడియో పేరుతో ‘Priti Rajput’ అనే ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ వీడియో పోస్ట్ కాగా, ఇది చూసిన వారందరు షాక్ అవుతున్నారు. ముందు ఇది చూసి అందరు రష్మికనే అలా ఫొటో షూట్ చేసింది అనుకున్నారు. కాని తర్వాత అసలు విషయం తెలుసుకొని వీడియో చేసిన వారిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక ఏమైన స్పందిస్తుందా అనేది చూడాల్సి ఉంది.