Site icon vidhaatha

Regina Cassandra | బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రెజీనా కసాండ్రా..! సోషల్‌ మీడియాలో వైరల్‌..

Regina Cassandra | రెజీనా కసాండ్రా (Regina Cassandra) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో తొలిసారిగా ఏడేళ్ల కిందట అడుగుపెట్టాల్సిన రెజీనా అనుకోని కారణాలతో ఆలస్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, వచ్చే ఏడాది ‘జాట్‌’ మూవీతో అభిమానుల ముందుకు రాబోతున్నది. ఈ క్రమంలో రెజీనా బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. తాను మూవీ ఎంట్రీ ఆలస్యానికి ‘మీటింగ్స్‌’ అనే పదం పేర్కొంది. ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ మూవీతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో పలు వరుస సినిమాలు చేస్తూ.. ఫేడ్‌ అవుట్‌ స్థితికి చేరుకున్నది. అయితే, అనూహ్యంగా తెలుగు, హిందీలో వస్తున్న ‘జాట్‌’ సినిమాలో నటించే ఛాన్స్‌ ఉన్నది. ఈ క్రమంలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టైమ్‌లో ఎదురైన సవాళ్లు, ఇబ్బందులపై ప్రస్తావించింది. అలాగే, నార్త్‌ సినిమా పరిశ్రమకు, సౌత్‌ ఇండస్ట్రీకి మధ్య తేడాలను చెప్పుకొచ్చింది. ప్రస్తుత రెజీనా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సౌత్‌ నుంచి నార్త్‌కు వెళ్లి లాంగ్వేజ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా చాలామందికి సినిమా అవకాశాలు కోల్పోయారు. కానీ, బాలీవుడ్‌ నుంచి ఇక్కడకు వచ్చినవాళ్లు ఎప్పుడూ ఆ ఇబ్బందిపడరు, ఇబ్బందిపెట్టరు అని పేర్కొంది రెజీనా. హిందీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు ముంబయిలోనే ఉండాలని, మీటింగ్స్‌ హాజరు కావాలని చెప్పారని.. ఈ విషయం తనకు నచ్చకపోయినా బాలీవుడ్‌లో అదే ముఖ్యమని అర్థమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ మీటింగ్స్‌ ఏంటో అనే చర్చ నడుస్తున్నది. రెజీనా ప్రస్తుతం కోలీవుడ్‌లో ‘విదాముయార్చి’, ‘ఫ్లాష్‌బ్యాక్‌’ మూవీల్లో కనిపించనున్నది. బాలీవుడ్‌లో ‘జాట్‌’తోపాటు ‘సెక్షన్‌ 108’ సినిమాల్లో నటించనున్నది.

Exit mobile version