Site icon vidhaatha

Relangi|బ్రేక్ కోసం 15 ఏళ్లు వేచి చూసిన రేలంగి.. ఏ సినిమాతో ఆయ‌న కెరీర్ టర్న్ అయింది

Relangi| న‌వ్వుల రేడు రేలంగి గురించి ఆ నాటి త‌రానికి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నవ్వుకే నవ్వు తెప్పించిన రేలంగి అస‌లు పేరు రేలంగి వెంకట్రామయ్య తెలుగు హాస్యాభినయాన్ని విభజిస్తే రేలంగికి ముందు, రేలంగి తరువాత అని చెప్పుకోవాలి. తెలుగు చిత్రసీమలో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న తొలి హాస్యనటునిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రేలంగి . తెలుగు సినిమా హాస్యం చర్చకు వచ్చిన ప్రతీసారి రేలంగి నవ్వులు మనకు కితకితలు పెడుతూనే ఉంటాయి. 1910 ఆగస్టు 13వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రావులపాడు గ్రామంలో జన్మించాడు. 1948లో వింద్యరాణితో ఇతని సినిమా నట ప్రస్థానం ప్రారంభమయినది. 40 సంవత్సరాలపాటు దాదాపు 300 సినిమాలలో నటించారు.

మిస్పమ్మ, అప్పుచేసి పప్పుకూడు, సువర్ణసుందరి, లవకుశ, సత్యహరిశ్చంద్ర, మయాబజార్, నర్తనశాల వంటి విజ‌య‌వంత‌‌మైన సినిమాల‌లో న‌టించి ప్రేక్షకుల‌ని ఎంత‌గానో న‌వ్వించారు రేలంగి వెంక‌ట్రామ‌య్య . చివరి దశలో ఆయ‌న‌ తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డారు. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా డాక్టర్లు తేల్చారు. 1975 నవంబర్ 26 ఉదయాన తాడేపల్లి గూడెంలోని తన స్వంత ఇంట్లో కీర్తిశేషులయ్యారు. రేలంగిని సినీపరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు సి.పుల్లయ్య. ఆయ‌న 1935లోనే సినిమాల్లో ప్రవేశించినా 1948 వరకు కూడా చెప్పుకోదగ్గ గుర్తింపు ద‌క్కించుకోలేక‌పోయారు. 1948లో వింధ్యారాణి చిత్రంతో ఆయన కెరియర్ విజయాల బాట పట్టింది. ఆ త‌ర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అలా నాలుగు దశాబ్ధాలకు పైగా 300 పై చిత్రాల్లో నటించారు.

నటుడిగా తారా స్థాయిని అందుకున్న రేలంగి పలు సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. రేలంగి తండ్రికి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తి పెద్దగా ఏమీ లేదు. రేలంగి తండ్రి ఓ పాఠశాలలో సంగీత మాస్టర్‌గా పనిచేస్తూ హరికథలు సంగీతం నేర్పించేవారు. మాట‌తో , క‌ళ్ల‌తో, చేతుల క‌ద‌లిక‌తో న‌వ్వించ‌గ‌ల రేలంగికి బ్రేక్ రావ‌డానికి 15 ఏళ్లు ప‌ట్టింది. దాని కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు. బంగారం అరిగే రోజుల్లో తిన‌డానికి మ‌ర‌మ‌రాలు లేవు. బంగారాన్ని కొని తినే రోజుల్లో మ‌ర‌మ‌రాలు కూడా అర‌గ‌డం లేదు. ఇది రేలంగి ఫేమ‌స్ కొటేష‌న్‌. చాప్లిన్‌లా గొప్ప తాత్వికుడు. నిజానికి పేరుకే కమెడియన్ కానీ అప్పట్లో రేలంగిని ఒక హీరోలాగా చూసేవారు.రెమ్యునరేషన్ కూడా ఇంచుమించు హీరోలతో ఈక్వల్ గా ఉండేది.రేలంగి ఉంటేనే సినిమా హిట్ అవుతుందని అప్పట్లో అనుకునేవారు.అంత డిమాండ్ ఆయనకు ఉండేది.

Exit mobile version