Renu Desai| ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మ‌ళ్లీ ఝ‌ల‌క్ ఇచ్చిన రేణూ దేశాయ్.. లెక్చ‌ర్స్ ఆపండంటూ వార్నింగ్

Renu Desai| ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న‌కి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ..హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే రేణూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఏదో ఒక విష‌యంలో హర్ట్ చేస్తూ ఉంటుంది. రేణూ దేశాయ్ ఇటీవ‌ల జంతువుల‌ సంరక్షణ కోసం ప్రతి నెల కొంత డొనేషన్‌ కూడా ఇస్తుందట. అయితే ఈ విష‌యంలో త‌న‌కు కొంత స‌పోర్ట్ అందించ‌మ‌ని కో

  • Publish Date - May 22, 2024 / 10:59 AM IST

Renu Desai| ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న‌కి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ..హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే రేణూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఏదో ఒక విష‌యంలో హర్ట్ చేస్తూ ఉంటుంది. రేణూ దేశాయ్ జంతువుల‌ సంరక్షణ కోసం ప్రతి నెల కొంత డొనేషన్‌  ఇస్తుందట. అయితే ఈ విష‌యంలో త‌న‌కు కొంత స‌పోర్ట్ అందించ‌మ‌ని ఇటీవ‌ల‌ కోరింది. రూ.3500 విరాళం కావాలంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే కొంద‌రు వెంట‌నే స్పందించి త‌మ వంతు సాయం చేశారు. వారంద‌రికి రేణూ దేశాయ్ ధ‌న్యవాదాలు తెలియ‌జేసింది.

రేణూ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌కి కొంద‌రు నెటిజ‌న్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ముడిపెడుతూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఎంతైనా పవన్‌ కళ్యాణ్‌ వైఫ్‌ కదా, పవన్‌ లాగే గోల్డెన్‌ హార్ట్ అంటూ కామెంట్లు చేశారు. దీనిపై రేణు దేశాయ్‌ గట్టి ఇచ్చేసింది. పెట్స్ పై నాకున్న ప్రేమ ఆయనకు లేదని మండిపడింది. పవన్‌ కి జంతువులపై ప్రేమ లేదా? మీరు అలా మాట్లాడవద్దని, మీ పిల్లలకు ఆయన తండ్రి అని, మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుందని రెచ్చిపోతూ కామెంట్లు చేశారు పవన్‌ ఫ్యాన్స్. దీనికి మండిపోయిన రేణు దేశాయ్‌ అసహనం వ్యక్తం చేసింది. నేను ఇప్పుడు ఆయన భార్యని కాదు. నా మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉంటుంది, నేను యానిమల్స్ ని ప్రేమించినంతగా ఆయన ప్రేమించలేడు. ఈ 55ఏళ్లలో ఆయన ఇంట్లో పిల్లులు, కుక్కలు వంటివి కూడా కనిపించవు. నాకు లెక్చర్స్ ఇవ్వడం ఇకనైనా ఆపండి, ఇన్నేళ్లు నన్ను తిడుతూనే ఉన్నారు, ఇకనైనా ఆపండి అంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది.

రేణూ దేశాయ్ ఛాటింగ్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇలా తరచూ రేణుదేశాయ్‌కి, పవన్‌ ఫ్యాన్స్ కి సోషల్‌ మీడియాలో వార్‌ జరుగుతూనే ఉంటుంది. గ‌తంలో కూడా ప‌లు విష‌యాల‌లో రేణూ దేశాయ్ వారికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. అప్పుడ‌ప్పుడు రేణూకి ఇరిటేట్ చేసే కామెంట్స్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం రేణూ దేశాయ్ త‌న ఇద్దరు పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటుంది. చివ‌రిగా `టైగర్‌ నాగేశ్వరరావు` సినిమాలో కీలక పాత్రలో మెరిసింది.

Latest News