Renu Desai| పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు కథానాయికగా నటించిన రేణూ దేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా సామాజిక సేవా కార్యక్రమాల పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా ఉన్న రేణు దేశాయ్ రీసెంట్‌గా అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిశారు. జూబ్లీహిల్స్ లోని కొండ సురేఖ నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రేణు దేశాయ్ కొండ సురేఖతో అనేక అంశాల పైన చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీ కి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించారు.
ఇక మంత్రిగా కొండా సురేఖ సహాయ సహకారాలు కావాలని రేణు దేశాయ్ కొండా సురేఖని కోరారు. ఆ సమయంలో కొండా సురేఖ సైతం సానుకూలంగా స్పందించారని, సమయం చూసుకుని రేవంత్ రెడ్డి తో కూడా భేటీ అవుదామని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రేణూ దేశాయ్ ఏపీ మీద కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. త్వరలో ఏపీ మీద కూడా దృష్టి పెట్టిన ఈ మాజీ హీరోయిన్… త్వరలోనే ఏపీ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కూడా భేటీ కానుందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు డిప్యూటి సిఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులో ఉన్న యూనివర్సిటీ పవన్‌కి వివరించి తద్వారా చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేయనున్నట్టు ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్‌ని రేణూ దేశాయ్ కలవబోతుంది అనే వార్త బయటకు వచ్చే సరికి ఈ వార్త క్షణాలలోనే వైరల్‌గా మారింది. ఇక రేణూ దేశాయ్ రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇక మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవాలని ప్రకటించినప్పటికి, పవన్ అభిమానుల విమర్శలకు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఇటీవల తాను త్వరలో తప్పక రెండో పెల్లి చేసుకుంటానని చెప్పి పవన్ ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది.