Renu Desai| నా మాజీ భ‌ర్త‌ని మిస్ అవుతున్నాన‌ని అన్నారంటే.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రేణూ

Renu Desai| జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ మాజీభార్య ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ అనేక ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు పెడుతూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అయితే రేణూ ఏ పోస్ట్ పెట్టిన కూడా ఆమెని సోషల్ మీడియాలో విసిగించడం చూస్తూనే ఉ

  • Publish Date - June 21, 2024 / 02:08 PM IST

Renu Desai| జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ మాజీభార్య ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ అనేక ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు పెడుతూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అయితే రేణూ ఏ పోస్ట్ పెట్టిన కూడా ఆమెని సోషల్ మీడియాలో విసిగించడం చూస్తూనే ఉన్నాం. రేణు దేశాయ్ ని వదిన అని పిలవడం వరకు ఓకే కానీ.. తిరిగి మీ మాజీ భర్త దగ్గరికి వచ్చేయండి అంటూ కొంద‌రు ఉచిత సలహాలు ఇస్తుంటారు. రేణూ దేశాయ్ తన విడాకులపై ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాల్లో ప్ర‌స్తావించింది. అయిన‌ప్ప‌టికీ కొందరు ప‌వ‌న్ అభిమానులు ఆమెని బాధ పెట్టేలా కామెంట్స్ చేస్తుంటారు.

అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ నెటిజన్ ఏకంగా రేణూ దేశాయ్‌ని మీరు అన్‌లక్కీ అంటూ కామెంట్ చేశాడు. దాంతో ఆమె అత‌డికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. నేను అన్ ల‌క్కీ ఎలానో చెబుతారా.. మీ స‌మాధానం కోసం వెయిట్ చేస్తున్నా అని రిప్లై ఇచ్చింది. నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్‌లక్కీ అంటూ కొంతమంది కామెంట్స్ చేయ‌డం నాకు చాలా బాధ‌గా ఉంది. నా అదృష్టాన్ని ఎందుకు ఒక వ్య‌క్తితో ముడిపెడ‌తారు అంటూ కౌంట‌ర్స్ కూడా ఇచ్చింది. మ‌నం 2024లో ఉన్నాం. ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకులతోనో చనిపోయిన భాగస్వామితోనే ముడిపెట్టడం ఆపండి అంటూ హెచ్చరించింది.

ఇక తాజాగా రేణు దేశాయ్ తన ఐఫోన్ లో డిసెంబర్ లో ఓ వీడియో ఎడిట్ చేయ‌గా, దానిని షేర్ చేయ‌డం మ‌రిచిపోయింద‌ట‌. అయితే ఇప్పుడు గుర్తుకు రావ‌డంతో షేర్ చేసింది. అయితే నెటిజన్లకు, పవన్ ఫాన్స్ కి కామెంట్ సెక్ష‌న్‌లో వార్నింగ్ ఇచ్చింది. ‘నా మాజీ భర్తని తిరిగి పొందడం ఎలా .. అతనిని నేను మిస్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి పోస్ట్ లు చేస్తోంది అని మీరు భావించి..అనవసరమైన ఉచిత స‌ల‌హాలు ఇస్తే మాత్రం వెంట‌నే బ్లాక్ చేస్తాను అంటూ రేణూ దేశాయ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. రేణూ ఇచ్చిన స్వీట్ వార్నింగ్‌కి కొంద‌రు ఇంప్రెస్ అవుతున్నారు.

Latest News