Ritu Chaudhary|కీర‌వాణి కొడుకుతో ప‌చ్చి బూతులు మాట్లాడిన జ‌బ‌ర్ధ‌స్త్ భామ‌..ఏంది ఈ అరాచ‌కం

Ritu Chaudhary| ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ కీర‌వాణి త‌న అద్భుత‌మైన సంగీతంతో సంగీత ప్రియుల‌ని ప‌ర‌వ‌శించేలా చేస్తారు. ఆయ‌న త‌న పిల్ల‌ల‌ని కూడా మెల్లగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా కోడూరి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, ఇప్పుడు ఆయ‌న హీరోగా గుర్తింపు పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మత్తు వదలరా చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయిన సింహా కోడూరి త‌ర్వాత కొన్ని చిత్రాలు చేశాడు. అయితే అవి అ

  • Publish Date - April 25, 2024 / 04:07 PM IST

Ritu Chaudhary| ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ కీర‌వాణి త‌న అద్భుత‌మైన సంగీతంతో సంగీత ప్రియుల‌ని ప‌ర‌వ‌శించేలా చేస్తారు. ఆయ‌న త‌న పిల్ల‌ల‌ని కూడా మెల్లగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా కోడూరి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, ఇప్పుడు ఆయ‌న హీరోగా గుర్తింపు పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మత్తు వదలరా చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయిన సింహా కోడూరి త‌ర్వాత కొన్ని చిత్రాలు చేశాడు. అయితే అవి అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు. దీంతో మంచి సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాల‌ని ఎంతో త‌ప‌న ప‌డుతున్నాడు. రీసెంట్‌గా మ‌నోడు జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ అనే షోకి హాజరయ్యాడు. ఈ ప్రోమోలో వారిద్ద‌రు మాట్లాడుకున్న మాట‌లు అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేస్తున్నాయి.

జ‌బ‌ర్ధ‌స్త్‌తో పాపుల‌ర్ అయిన రీతూ చౌద‌రి ఇటీవ‌లి కాలంలో చాలా హాట్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో చాలా గ్లామ‌ర్ వ‌డ్డిస్తూ మ‌రోవైపు దావ‌త్ షోలో చిలిపి ప్ర‌శ్న‌లు, డ‌బుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే సింహా కోడూరిని.. మీ ఇంట్లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, హీరో ఇలా అందరూ ఉన్నారు అది ఎలా సాధ్య‌మైంద‌ని ప్ర‌శ్నించ‌గా,దానికి శ్రీసింహా.. మేము పేకాట ఆడినట్లు ఇవన్నీ పంచుకోలేదు అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇక మీ సినిమాలో మీరు లిప్ లాక్ పెడ‌తారు క‌దా, అప్పుడు మీ ఫ్యామిలీ ఆ స‌న్నివేశం చూస్తుంటే రియాక్ష‌న్ ఎలా ఉంటుంది, ఇక్క‌డ లిప్ లాక్ అవ‌స‌రం లేక‌పోయిన ఎందుకు పెట్టారు, సింహా నువ్వే అడిగావా అని రాజ‌మౌళి ప్ర‌శ్నిస్తాడా అని రీతూ అడిగింది. దానికి అలా ఏమి అడ‌గ‌రు అన్నాడు, వెంటనే రీతూ… అయితే బాగా పెట్టావు అని కాంప్లిమెంట్ ఇస్తారా అని రీతూ అనే స‌రికి శ్రీ సింహా సిగ్గుప‌డిపోయాడు.

మీరు లిప్ లాక్ పెట్టే సీన్ కి కీరవాణి గారు మ్యూజిక్ ఇవ్వాలంటే ఎలా ఫీల్ అవుతారు అని శ్రీసింహాని రీతూ అడ‌గ‌గా, ఆయ‌న అప్ప‌డు మీరు ఏవేవో అడుగుతున్నారు.. నాకు అర్థం కావడం లేదు అంటూ కాస్త ఇబ్బందిగా స‌మాధానం ఇచ్చాడు. ఇక ఆ త‌ర్వాత కీరవాణి గారు రాజమౌళి గారి సినిమాల‌కి మంచి మ్యూజిక్ ఇస్తారు. వేరే చిత్రాలకు ఆ రేంజ్ లో ఇవ్వరు ఎందుకు ? మీ నాన్న పేరు ఎంఎం కీరవాణి.. మరి మీ పేరేంటి సింహా కోడూరి అని ఉంది ? అంటూ కొన్ని ప్ర‌శ్న‌లు వేసింది. చివ‌రిగా సింహా స్లోనా.. ఫాస్టా.. అని అడిగింది.. అప్పుడు ఎందులోనో వివరించి అడగండి అని సింహా అంటాడు. ఎందులోనో మీకు తెలుసు నాకు తెలుసు.. స్పెసిఫిక్ గాచెప్పడం ఎందుకు ? అంటూ రీతూ చెప్ప‌డంతో మ‌నోడు తెగ సిగ్గుప‌డిపోయాడు.

Latest News