Site icon vidhaatha

Sai Pallavi| సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్ డే స్పెష‌ల్‌.. తండేల్ నుండి విడుద‌లైన వీడియో ఎంత క్యూట్‌గా ఉంది..!

Sai Pallavi| మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి క‌నెక్ట్ అయిన ఈ భామ ఇప్పటి వ‌ర‌కు చేసిన వైవిధ్య‌మైన పాత్ర‌లు ఎంత‌గానో క‌ట్టిప‌డేసాయి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు సాధించిన ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ బిరుదు ద‌క్కించుకుంది. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ స్కిన్ షో చేస్తూ టాప్ హీరోయిన్ స్టేట‌స్ సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తుండ‌గా, . సాయి పల్లవి మాత్రం పద్దతిగా కనిపిస్తూ స్కిన్ షోకు నో చెప్తూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది.

ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి.. నాగ చైత‌న్య‌తో క‌లిసి తండేల్ అనే సినిమా చేస్తుంది. ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది కాగా, ఈ సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా ఈ మూవీ తెర‌కెక్కుతుండగా, ఇందులో నాగ‌చైత‌న్య ఓ జాల‌రి పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌గా, ప‌ల్లెటూరి అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథతో చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీకి సంబంధించి తాజాగా గ్లింప్స్ విడుద‌లైంది. సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. నటిగా సాయి ప‌ల్ల‌వి పెర్ఫార్మెన్స్ ఈ చిత్రం లో ఎలా ఉండబోతుంది అనే విషయం వీడియో ద్వారా తెలియ‌జేస్తూ మంచి ట్రీట్ ఇచ్చారు. సాయి పల్లవి గురించి గొప్పగా చెప్తూ ఆమె ప‌ర్‌ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, షూటింగ్ సెట్స్ లో తను చేసే అల్లరి, మంచి పనులు అన్ని కూడా మేకింగ్ వీడియోలో చూపించారు. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉండటంతో వైరల్ గా మారయింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తండేల్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. తెలుగుతో పాటు త‌మిళం మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

Exit mobile version