Sai Pallavi | సాయిపల్లవిని పడక సుఖం కోరిన టాలీవుడ్‌ డైరెక్టర్‌..? సోషల్‌ మీడియాలో వైరల్‌..!

Sai Pallavi | సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. ఫిదా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన న్యాబుచర్‌ బ్యూటీ ఆకట్టుకున్నది. ఆ తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. భారీగా అవకాశాలు వచ్చినా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నది.

  • Publish Date - May 15, 2024 / 08:55 AM IST

Sai Pallavi | సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. ఫిదా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన న్యాబుచర్‌ బ్యూటీ ఆకట్టుకున్నది. ఆ తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. భారీగా అవకాశాలు వచ్చినా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నది. అయితే, సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌, రొమాంటిక్‌ సీన్స్‌కు దూరంగా ఉండడంతో మరింత మంది అభిమానులయ్యారు. తొలిసారిగా బాలీవుడ్‌లో నటించబోతున్నది. అమీర్‌ఖాన్‌ మేనల్లుడితో కలిసి ఓ చిత్రంలోనూ నటిస్తున్నది. ఇక రణబీర్‌ కపూర్‌ హీరోగా వస్తున్న ‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రను పోషించబోతున్నది.

ఇదిలా ఉండగా.. సాయి పల్లవికి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. అయితే, కెరియర్‌ ప్రారంభంలో కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నట్లు ఆ వార్త సారాంవం. టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌ కమిట్‌మెట్‌ అడిగాడని.. పడక సుఖం అందిస్తే తాను దర్శకత్వం చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇస్తానని చెప్పాడట. డైరెక్టర్‌ వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సాయి పల్లవి.. ఏమాత్రం భయపడకుండా గట్టిగానే ఇచ్చిపడేసిందట. కమిట్మెంట్ కావాలా..? నీపై లీగల్ యాక్షన్ తీసుకోవడంతో పాటు బజారుకీడుస్తానని ఆగ్రహం వ్యక్తం చేసిందట. సాయి పల్లవి నుంచి వచ్చిన రియాక్షన్‌ చూసి దర్శకుడు భయాందోళనకు గురై వెంటనే క్షమాపణలు చెప్పాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది.

అయితే, ఇందులో ఎంత వాస్తవం ఉన్నది తెలియరాలేదు కానీ.. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు సాయి పల్లవి నోరు విప్పలేదు. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ.. ఈ విషయంలో సాయి పల్లవిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా.. క్యాస్టింగ్‌ కౌచ్‌ మరోసారి సంచలనంగా మారింది. ఇటీవల పలువురు క్యాస్టింగ్‌ కౌచ్‌ బారినపడ్డట్లు వెల్లడించారు. టాలీవుడ్‌ సీరియర్‌ హీరోయిన్‌ రమకృష్ణ క్యాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీతో పాటు మిగతా పరిశ్రమల్లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని… కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడమూ నిజమేనన్నారు. స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest News