అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఐసీస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని పాకిస్తాన్‌ను హెచ్చరించారు. పాక్ కాబూల్ లోని ఓ మార్కెట్లో బాంబు దాడి చేసినట్లు ఇటీవల అప్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బలగాలే లక్ష్యంగా అప్ఘనిస్తాన్ ప్రతిదాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ దాడుల్లో మంది సైనికులు మృతి చెందారని.. 30 మందికి పైగా గాయాలయ్యాయని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ ప్రకటించారు.
58 మంది పాక్ సైనికులు హతం..తాలిబన్ ప్రతినిధి ముజాయిద్ ప్రకటన
అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు
