Afghanistan death penalty| బాలుడితోనే హంతకుడికి బహిరంగ మరణ శిక్ష

అఫ్ఘానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం ఓ హంతకుడికి బాధిత కుటుంబంలోని బాలుడితోనే బహిరంగ మరణిశిక్షను అమలు చేయించింది. ఆఫ్ఘన్ సుప్రీం ఆదేశాలతో 80 వేల మంది ముందు అఫ్గానిస్థాన్‌ పోలీసులు శిక్షను అమలు చేయించారు

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం (Afghanistan)  ఓ హంతకుడికి బాధిత కుటుంబంలోని బాలుడితోనే బహిరంగ మరణిశిక్ష(death penalty)ను అమలు చేయించింది. ఆఫ్ఘన్ సుప్రీం ఆదేశాలతో 80 వేల మంది ముందు అఫ్గానిస్థాన్‌ పోలీసులు శిక్షను అమలు చేయించారు. కోస్ట్ స్టేడియంలో 13 ఏళ్ల బాలుడి చేత హంతకుడిని కాల్చి చంపించారు. నిందితుడు మంగళ్ దాడిలో అబ్దుల్ కుటుంబానికి చెందిన 13 మందిని దారుణంగా హతమయ్యారు. ఈ కేసులో క్షమాభిక్షకు బాలుడు నిరాకరించడంతో.. బాధిత బాలుడికే తుపాకీ ఇచ్చిన పోలీసులు మంగళ్ ను కాల్చి చంపించడం ద్వారా మరణ శిక్షను అమలు చేయించారు.

షరియా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని తాలిబన్ ప్రభుత్వం దేశంలోని జడ్జిలకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. అఫ్గానిస్తాన్‌లో 1996 నుంచి 2001 మధ్య కాలంలో తాలిబాన్ ప్రభుత్వమే ఉంది, రెండోసారి అధికారాన్ని చేజిక్కుంచుకున్నాక..కఠినమైన షరియా చట్టాలలో కొంత సడలింపు ఇచ్చినప్పటికి మరణ శిక్షలను మాత్రం కొనసాగిస్తుంది.

 

Latest News