Samantha| స‌మంత ఈజ్ బ్యాక్.. మెగాస్టార్‌కి జోడీగా కొత్త సినిమా అనౌన్స్ చేయ‌నుందా?

Samantha| ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత మ‌యోసైటిస్ కార‌ణంగా ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ భామ ఇక సినిమాల స్పీడ్ పెంచే ఆలోచ‌న చేస్తుంది. గత రెండు మూడు ఏళ్లుగా సినిమాలను భారీగా తగ్గించిన స‌మంత ఒక ద‌శ‌లో సినిమా

  • Publish Date - June 13, 2024 / 04:28 PM IST

Samantha| ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత మ‌యోసైటిస్ కార‌ణంగా ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ భామ ఇక సినిమాల స్పీడ్ పెంచే ఆలోచ‌న చేస్తుంది. గత రెండు మూడు ఏళ్లుగా సినిమాలను భారీగా తగ్గించిన స‌మంత ఒక ద‌శ‌లో సినిమాలు మ‌ళ్లీ చేస్తుందా, కెరీర్‌కి గుడ్ బై చెప్పిన‌ట్టేనా అనే అనుమానాలు క‌లిగించింది. కాని ఇప్పుడిప్పుడే సమంత సినిమాల వేట మొదలు పెట్టింది. ఖుషీ మూవీ త‌ర్వాత స‌మంత నుండి ఒక్క సినిమా రాలేదు. సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించి చాలా నెలలు గడుస్తుంది. అయితే స‌మంత బ‌ర్త్ డే సంద‌ర్భంగా తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పై ‘మా ఇంటి బంగారం’ మూవీ అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే స‌మంత మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు టాక్ న‌డుస్తుంది. స‌మంత తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో న‌టించిన‌ప్ప‌టికీ మ‌ల‌యాళ భాష‌లో న‌టించింది లేదు. దాదాపు దశాబ్ద కాలం కెరీర్‌లో ఇప్పటి వరకు ఆమె మాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే మలయాళంలో ఇప్పుడు సినిమా చేసేందుకు స‌మంత సిద్ధ‌మైంద‌నే టాక్ న‌డుస్తుంది. ఆమెకు ఇదే డైరెక్ట్ మూవీ అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే కాకుండా మమ్ముట్టితో కలిసి నటించడం కూడా ఇదే తొలిసారి అని ఇండ‌స్ట్రీ టాక్. మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపికైంద‌ని, ఈ మూవీ మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి కూడా వెళ్ల‌నుంద‌ని టాక్.

చెన్నైలో ఈ థ్రిల్లర్ మూవీ షూట్ ఎక్కువగా జరగనుందని టాక్. అయితే ఈ సినిమాలో ముందు నయనతారను హీరోయిన్ గా అనుకోగా, ప‌ర్స‌న‌ల్ రీజన్స్ , వ‌ర్క్ క‌మిట్‌మెంట్ వ‌ల‌న ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న‌ట్టు స‌మాచారం. ఇక న‌య‌న‌తార త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో స‌మంత‌కి ఈ బిగ్ ఆఫర్ వ‌చ్చింద‌ని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వినికిడి. ఇక స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాక రేపుతూ ఉంటుంది. ఇటీవల ఈషా ఫౌండేషన్ సద్గురు వద్ద ధ్యానం చేస్తున్నట్లు పోస్ట్ పెట్టింది. ఇక స‌మంత న‌టించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest News