Site icon vidhaatha

Samantha|స‌మంత చేతిలో ఒక్క సినిమా లేదు.. అయినా కూడా రష్మిక, కాజల్‌, నయనతార వెనక్కి నెట్టేసింది..!

Samantha| స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఆమె ఈ స్థాయికి చేరుకుంది. హీరోయిన్ కాక‌ముందు స‌మంత ప‌డ్డ క‌ష్టాలు అంత ఇంతా కావు. ఏ మాయ చేశావే సినిమాతో ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ త‌ర్వాత వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చివ‌రిగా ఖుషి అనే సినిమాతో ప‌ల‌క‌రించిన ఈ భామ మ‌రి కొద్ది రోజుల‌లో సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప‌ల‌క‌రించ‌నుంది. అయితే స‌మంత ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎంత డిస్ట్ర‌బ్ అయిందో మ‌నం చూశాం. ఒక‌వైపు ఆరోగ్య స‌మస్య‌లు, మ‌రోవైపు నాగ చైత‌న్య‌తో డివోర్స్ స‌మంత‌ని చాలా ఇబ్బంది పెట్టాయి. వాట‌న్నింటిని అధిగ‌మిస్తూ ముందుకు సాగుతుంది.

స‌మంత ఈ మ‌ధ్య సినిమాలు చేయ‌డం లేదు కాని సోష‌ల్ మీడియాలో, ప‌లు ఈవెంట్స్‌తో తెగ సంద‌డి చేస్తుంది. అయితే స‌మంత సైలెంట్ కావ‌డంతో ఆమె అవ‌కాశాల‌ని మిగ‌తా హీరోయిన్స్ ఎగ‌రేసుకుపోతున్నారు.దాదాపు ఏడాదిగా స‌మంత సినిమాలు చేయ‌క‌పోయిన కూడా ఆమె క్రేజ్ త‌గ్గ‌లేదు. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ పోలింగ్‌ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో సమంత మొదటి స్థానం ద‌క్కించుకుంది. మార్చి నెలలో ఇండియా వైడ్‌గా పాపులర్‌, క్రేజ్‌ని, అత్యంత అభిమానాన్ని పొందిన హీరోయిన్లలో సమంతకి తొలి స్థానం ద‌క్కింది. టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఫీమేల్‌ స్టార్స్ లో సమంతకి మొద‌టి స్థానం ద‌క్క‌గా, రెండో స్థానంలో అలియా భ‌ట్ నిలిచింది.

మూడో స్థానంలో దీపికా పదుకొనె నిలవడం విశేషం. ఆమె గతేడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ `పటాన్‌`, `జవాన్‌` చిత్రాలతో మంచి విజ‌యాల‌ని అందుకోగా, త్వ‌ర‌లో క‌ల్కితో ప‌ల‌క‌రించ‌నుంది. ఇక నాలుగో స్థానంలో కాజల్‌ నిలిచింది. కాజల్‌ గతేడాది `భగవంత్‌ కేసరి` చేసిన ఈ భామ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోను స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇక బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఐదో స్థానంలో నిలవగా, ర‌ష్మిక ఆరో స్థానంలో, న‌య‌న‌తార ఏడో స్థానంలో, త్రిష ఎనిమిదో స్థానంలో, కీర్తి సురేష్‌ తొమ్మిదో స్థానంలో, కృతి సనన్‌ పదో స్థానానికి పరిమితమయ్యింది. మొత్తానికి స‌మంత సినిమాలు చేయ‌క‌పోయిన త‌న గ్లామ‌ర్ ట్రీట్‌తో ఈ భామ సెన్సేష‌న్‌గా మారుతుంది.

Exit mobile version