Site icon vidhaatha

Samantha|మిడిల్ ఫింగ‌ర్ చూపించిన స‌మంత‌.. అంత కోపం ఎవ‌రిపైన‌…!

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంతకి ప్ర‌స్తుతం బ్యాడ్ ఫేజ్ న‌డుస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్య‌క్తి నుండి విడిపోవ‌డం, మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డం, న‌టించిన సినిమాలు అన్ని ఫ్లాప్స్ కావ‌డం స‌మంత‌ని ఇబ్బంది పెడుతున్నాయి. అయిన‌ప్ప‌టికి స‌మంత చాలా ధైర్యంగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక విష‌యాలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే స‌మంత న‌టించి హ‌నీ బ‌న్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కి రెడీగా ఉంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి హనీ బన్నీ రీమేక్. రాజ్ అండ్ డీకే హనీ బన్నీ తెరకెక్కించగా సమంత-వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు చేశారు. నవంబర్ 7నుండి హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

అయితే గ‌త రెండు మూడు రోజులుగా రాజ్ తో సమంతకు మంచి అనుబంధం ఉందని, అది ప్రేమకు దారి తీసింది అంటున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు స‌హ‌జీవనం చేస్తున్నార‌ని కూడా అంటున్నారు. అత‌ని వ‌ల్ల‌నే స‌మంత.. చైతూకి బ్రేకప్ చెప్పింద‌నే టాక్ కూడా న‌డిచింది. ఈ వార్త‌ల‌పై స‌మంత స్పందించింది లేదు. తాజాగా స‌మంత త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఫొటో మాత్రమే పోస్ట్ చేసి.. దానికి ఎలాంటి క్యాప్షన్ లేకుండా వదిలేసింది. ఇందులో సామ్ స్వెట్ షర్ట్ వేసుకొని, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ తో స్ట‌న్నింగ్‌ లుక్ లో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న షర్ట్ పై “శాంతి, నిశ్శబ్దానికి మ్యూజియం” అని రాసి ఉంది. అంతేకాదు ఈ పోస్టుకు ఆమె నవ్ వి ఆర్ ఫ్రీ అనే పాటను కూడా జోడించింది. మ‌రోవైపు ఆమె తలకు అలా చేయి ఆనించి తన మిడిల్ ఫింగర్ చూపించిన‌ట్టుగా క‌నిపిస్తుంది.

అయితే ఆ ఫొటోలో అందరి కళ్లూ ఆమె వేలివైపే వెళ్లాయి. ఈ పోస్ట్‌ని బ‌ట్టి చూస్తే.. సమంత ఎవరికో పరోక్షంగా కౌంటర్ ఇస్తుందనేది అర్థం అవుతుంది. సమంత కోపం ఎవరి మీద అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఎఫైర్ లో ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత కౌంటర్ ఇచ్చారేమో అని కొంద‌రు భావిస్తున్నారు. ఇక ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటు చేసిన సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ ప్రకటించింది. ఇందులో కీల‌క పాత్ర పోషించిన స‌మంత ఈ మూవీని లేడి ఓరియెంటెడ్ చిత్రంగా నిర్మిస్తుంది.

Exit mobile version